NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ఫ్యాన్ ఇండియాలో భారీ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించి పెట్టడమే కాకుండా పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో చూపిస్తుంది. అందుకే ఎన్టీఆర్ గత 10 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే బాలీవుడ్లో ఆయనకు భారీ మార్కెట్ క్రియేట్ అవ్వాలన్న ఇండియా వైడ్ గా తను నెంబర్ వన్ హీరోల లిస్ట్ లో నిలవాలన్నా కూడా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా ఇండస్ట్రీ హిట్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆయనకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు.
Also Read : ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్
మరి పాన్ ఇండియాలో కనక ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్నట్లయితే ఆయన నెంబర్ వన్ హీరోగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.
తద్వారా సినిమాల వల్ల ఆయన ఐడెంటిటి ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ మీదనే కన్నేశాడు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కాంబినేషన్ సెట్ చేసింది కూడా అందుకే అని ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకున్న ఐడెంటిటీని మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మిగతా హీరోలతో పోటీని తట్టుకొని నిలబడాలంటే ఈ మూవీతో భారీ సక్సెస్ కొట్టాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!