https://oktelugu.com/

NTR : ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ పై అసంతృప్తితో ఉన్న అభిమానులు!

NTR : టెంపర్ చిత్రం నుండి 'దేవర'(Devara Movie) వరకు వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అసలు అభిమానులకు ఫ్లాప్ అనే పదాన్ని మర్చిపోయేలా చేశాడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR).

Written By: , Updated On : March 26, 2025 / 09:59 AM IST
NTR

NTR

Follow us on

NTR : టెంపర్ చిత్రం నుండి ‘దేవర'(Devara Movie) వరకు వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అసలు అభిమానులకు ఫ్లాప్ అనే పదాన్ని మర్చిపోయేలా చేశాడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR). అభిమానులు ఆయన సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంతో ఉన్నారు. #RRR చిత్రం లో ఎన్టీఆర్ క్యారక్టర్ బాగా తగ్గింది అనే భావన అభిమానుల్లో అప్పట్లో బాగా ఉండేది. అందుకే తదుపరి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూసారు. ‘దేవర’ ఎప్పుడైతే విడుదలైందో, అభిమానులు ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెన్సేషనల్ వసూళ్లను అందించారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు 400 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందంటే అభిమానుల కసి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ చిత్రం ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది.

Also Read : లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఎన్టీయార్…

ముఖ్యంగా ఈ సినిమా పాటలకు వచ్చిన రీచ్ ఈమధ్య కాలం లో ఏ సూపర్ హిట్ సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున జపాన్ దేశంలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆ మూవీ ప్రొమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రొమోషన్స్ ని చూసి అభిమానులు అసూయ పడుతున్నారు. కారణం ఎన్టీఆర్ ఆ మూవీ థియేటర్స్ లోకి వెళ్లి, అక్కడి అభిమానులతో డ్యాన్స్ లు వేయడమే. ఒక థియేటర్ కి ప్రమోషన్ కోసం వెళ్లిన ఎన్టీఆర్, అక్కడ ‘జాతర’ పాటకు అభిమానులతో కలిసి డ్యాన్స్ వేశాడు. అందుకు సంబంధించిన వీడియో ని మూవీ టీం సోషల్ మీడియా లో అభిమానులకు షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అభిమానులు ఈ వీడియో ని చూసి కుళ్ళుకుంటున్నారు.

మాకు దొరకని అదృష్టం జపాన్ ఫ్యాన్స్ కి దొరికింది, మాతో కూడా ఎన్టీఆర్ అన్నయ్య కలిసి అలా డ్యాన్స్ వేయొచ్చు కదా అని అభిమానులు అసూయ పడుతున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ బయట జనాల్లోకి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఏ సంఖ్యలో గుమ్మిగూడుతారో అనేది. ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ లో భాగంగా చేసుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల తాకిడికి తట్టుకోలేక రద్దు చేసారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ అలా మన థియేటర్స్ లోకి వచ్చి డ్యాన్స్ వేసే పరిస్థితి ఉందా?, ఒకవేళ అలాగే చేస్తే ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన రిపీట్ అవుతుంది. అందుకే ఎన్టీఆర్ ఇలాంటివి ఇక్కడ చేయలేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు వివరణ ఇస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో మరో చిత్రం చేయబోతున్నాడు.

Also Read : జపాన్ థియేటర్స్ లో ఎన్టీఆర్ మేనియా..గూస్ బంప్స్ రప్పించే వీడియో!