RRR PressMeet: టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవగణ్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గలింప్స్, పాటలు అభిమానులను ఎంతగానో ఆక్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అయితే యూట్యూబ్‌నే షేక్ ఆడిస్తోంది.
కాగా, ఈ క్రమంలోనే ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ముంబయిలో మీడియా సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే తారక్, రాజమౌళి, అలియాభట్, అజయ్ దేవగణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాలో సీత పాత్రలో కనపించనుంది అలియా. ఈ నేపథ్యంలోనే ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తో పాటు అలియా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
https://www.instagram.com/p/CXQjyFAPNbb/?utm_source=ig_web_copy_link
ముఖ్యంగా సంప్రదాయానికి కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి ఆమె ధరించిన శారీ.. అభిమానులను ఆకట్టుకుంది. ఎరుపు రంగు చీరలో వచ్చిన అలియా.. ఈ దుస్తులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. కాగా ఇదే ఈవెంట్‌లో అలియా ధరించిన గోల్డ్ డ్యాంగ్లింగ్ చెవిపోగులు, రింగులు, ఇతర ఆభరణాలు ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనుండగా.. కొమరం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు.
