Homeఎంటర్టైన్మెంట్Rajamouli: స్క్రిప్ట్​ మొత్తం ఇచ్చెయ్యమంటారా?.. మీడియాపై రాజమౌళి సెటైర్​

Rajamouli: స్క్రిప్ట్​ మొత్తం ఇచ్చెయ్యమంటారా?.. మీడియాపై రాజమౌళి సెటైర్​

Rajamouli: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ మూవీలో తారక్ కొమరం భీమ్​గా కనిపించనుండగా… చరణ్​ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్​ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్​కు చేరుకుని… ప్రభంజనం సృష్టించింది.

ముంబయిలో ఇటీవలే మీడియాతో ముచ్చటించిన రాజమౌళి అండ్​ టీమ్​.. తాజాగా హైదరాబాద్​లోనూ మీడియాతో సమావేశమయ్యారు. ఇందులో రామ్​చరణ్​, తారక్ కూాడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాలో తారక్​, రామ్​చరణ్​ పాత్రలతో పాటు అజవ్​ దేవగణ్​ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్​లో సమాధానం చెప్పి పంచులు వేశారు రాజమౌళి.

ఇందులో అజయ్​ దేవగణ్​ పాత్ర ఎలా ఉంటుంది.. తారక్​ ముస్లిం గానే కనిపిస్తారా అని అడగ్గా… నేను ట్రైలర్​లోనే చెప్పాల్సిందందా చెప్పేశా.. చాలా క్లియర్​గా చూపించా.. కానీ ఇంకా మీరు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇది చూస్తుంటే స్క్రిప్ట్ మొత్తం మీకు చూపించమని అడుగుతున్నట్లు అంది అని నవ్వుతూ సరదాగా అన్నారు. దీంతో సమావేశం మొత్తం నవ్వులు పూశాయి. దీంతో పాటు ఈ సినిమా మొత్తం పూర్తి కల్పితమని.. కేవలం భీమ్​, రామ్ వ్యక్తిత్వాలను చూపించేందుకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. హిస్టరీ చూపించడం తమ ఉద్దేశం కాదని అన్నారు రాజమౌళి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular