https://oktelugu.com/

NTR Koratala Siva Movie: ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్

NTR Koratala Siva Movie: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమా కోసం కొరటాల భారీ తారాగణాన్ని తీసుకోబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 13, 2022 / 05:13 PM IST
    Follow us on

    NTR Koratala Siva Movie: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమా కోసం కొరటాల భారీ తారాగణాన్ని తీసుకోబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    Jr NTR and Koratala Siva

    Jr NTR and Koratala Siva

    నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్ నే అని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా తారక్, జాన్వీ కపూర్ వైపే మొగ్గు చూపాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జాన్వీ కపూర్, తారక్ సినిమాలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందట. జాన్వీ కపూర్ ని తెలుగులో తీసుకువచ్చేందుకు కొరటాల ఇప్పటికే ప్లాన్ చేశాడు.

    Also Read: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..

    జాన్వీ కపూర్.. అలియా సిస్టర్ పాత్రలో కనిపించబోతుంది. నిజానికి ‘భరత్ అనే నేను’ అనే సినిమాలో కియరా అద్వానీ ప్లేస్ లో మొదట జాన్వీనే తీసుకోవాలని కొరటాల అనుకున్నారు. అయితే, ఏజ్ గ్యాప్ కారణంగా జాన్వీ ప్లేస్ లోకి అప్పుడు కియారా వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి కొరటాల జాన్వీతో ఫిక్స్ కాబోతున్నాడు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. జాన్వీకి కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి ఉంది.

    ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని ఇప్పటికే షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఆ మధ్య అయితే.. ఈ సినిమా గురించి కొరటాల ట్వీట్ చేస్తూ..’లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల ఈ సినిమా స్థాయి గురించి పోస్ట్ చేసిన మెసేజ్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

    janhvi kapoor

    ఇక ఎలాగూ.. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

    Also Read: బిగ్‌బాస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అమెనేనా..?

    Tags