Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కి టాలెంట్ లేకపోయినా గ్లామర్ ఉంది, ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ చేస్తోంది.. అందుకే బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ అనగానే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ లనే అందుకుని బాగానే క్యాష్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో నిధి అగర్వాల్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఈ బ్యూటీ హవా టాలీవుడ్ లో కాస్త తగ్గుముఖం పట్టిందట. ఏమైనా అక్కినేని హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల సరసన వరసగా అవకాశాలు పొంది.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది నిధి. కానీ ఆ తరువాత బిగ్ స్టార్ హీరోల సరసన మాత్రం ఎందుకో అవకాశాలు సంపాదించలేకపోయింది, ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా తప్ప.
Also Read: బిగ్‌బాస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అమెనేనా..?
రామ్ లాంటి హీరోతో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమాలో మల్టిపుల్ హీరోయిన్లు ఉండటంతో నిధి అగర్వాల్ కి సోలో హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోలతో మాత్రమే నిధి ఇన్నాళ్లు నటించగలిగింది. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా రావడంలేదట. తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయని అర్ధం చేసుకున్న ఈ బబ్లీ బ్యూటీ ప్రస్తుతం తమిళం పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలో తమిళంలో జయం రవి, విశాల్, విజయ్ సేతుపతి లాంటి హీరోలతో చెప్పుకోదగిన స్థాయిలోనే నిధి అగర్వాల్ సినిమాలు చేయబోతుంది. నిధి అగర్వాల్ కి మొత్తానికి తమిళంలో అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి. మరి తమిళంలో తనకు వచ్చిన ఆ కొద్ది స్టార్ డమ్ ను.. మరింతగా ముందకు తీసుకుపోయేందుకు నిధి అగర్వాల్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
సూర్య తదుపరి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. సింగం సీరిస్ దర్శకుడు హరి డైరెక్షన్ లో సూర్య చేయబోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు అవకాశం రావడంతో అక్కడ ఫామ్ లో ఉన్న మిగిలిన హీరోలు కూడా ‘నిధి అగర్వాల్ ‘కు అవకాశం ఇస్తున్నారట. సూర్య సినిమాతో పాటు తాజాగా స్టార్ హీరో అజిత్ సినిమాలోనూ నిధి అగర్వాల్ కి మరో అదిరిపోయే ఛాన్స్ వచ్చిందట.
Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్