https://oktelugu.com/

Devara Review : దేవర ఫుల్ మూవీ రివ్యూ

బహుశా ఆ క్యారెక్టర్ వల్లే ఆమెకు అలాంటి ఒక ఫీల్ అయితే వచ్చిందేమో...ఆమె తన పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా నటన మీద ఎలాంటి మక్కువ అయితే ఉందో మరోసారి చూపించాడు.

Written By: Gopi, Updated On : September 27, 2024 7:06 am

Devara movie Review

Follow us on

Devara Review : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఇప్పటికే అర్ధరాత్రి నుంచి అభిమానుల కోసం ప్రీమియర్ షోలు అయితే వేశారు. మరి అందులో భాగంగానే ఇప్పటి వరకు వరుస సక్సెస్ లను అందుకుంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడా? ఆచార్య సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సముద్ర తీరంలో బతుకుతున్న కొంతమంది వ్యక్తులు సముద్రాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే అదే సముద్రాన్ని వాడుకొని సైఫ్ అలీ ఖాన్ అలాగే ఇంకొంత మంది ఇల్లీగల్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే శ్రీకాంత్ వాళ్ల బిజినెస్ లకి అడ్డుపడతాడు. ఆ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ శ్రీకాంత్ ను చంపించాలనే ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ (దేవర) శ్రీకాంత్ ను కాపాడి వాళ్లందరికీ అండగా నిలబడతాడు. ఇక అక్కడి నుంచి ఇల్లీగల్ ఆక్టివిటీస్ జరగకుండా చూసుకోవడమే తన బాధ్యతగా ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ ని కొంతమంది చంపేస్తారు. ఇక మొదట భయస్తుడిగా కనిపించిన దేవర కొడుకు దేవరా ను చంపిన వాళ్ళని చంపాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తనదైన రీతిలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ ని మలిచిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవర పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ 100% న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక కొరటాల శివ కూడా ఈ క్యారెక్టర్ రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. మొదటినుంచి చివరి వరకు ఆ క్యారెక్టర్ తనకు ఒక హై ఫీల్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆ ఎన్టీయార్ ఆ క్యారెక్టర్ ఒక మంచి ఎమోషనల్ సీన్స్ రాస్తూనే సినికలో ఉన్న మూడ్ చెడగొట్టకుండా డీసెంట్ స్క్రీన్ ప్లే రాసుకొని కొరటాల ఈ సినిమాను ముందుకు నడిపించాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ప్రేక్షకుల్ని విపరీతంగా కట్టుకుంటాయి. మొదట్లో ఈ సినిమాకి నేగిటివిటీ బాగా స్ప్రెడ్ అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం అంత నెగిటివిటి అయితే ఏం లేదు. ఇక కొరటాల శివ సినిమా స్టార్టింగ్ లో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే విధానంలో కొంతవరకు సినిమా లాగ్ అయినట్టుగా అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరు ఊహించని విధంగా ఉండడమే కాకుండా ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ ఒక హై ఫీల్ అయితే ఇస్తుంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆ రెండు క్యారెక్టర్లలో కూడా జీవించాడనే చెప్పాలి. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ప్రతి ఎలివేషన్ సీన్స్ లో అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కొంతవరకు పర్లేదు అనిపించింది. కానీ అనిరుధ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి కొంతవరకు ఆయన తక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అలాగే డిఓపి రత్నవేలు వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన చేసిన కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక సముద్రంలో తీసిన సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి.

ఇక సెకండ్ హాఫ్ అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక గ్రాఫిక్స్ విషయ లో ఈ సినిమా కొంతవరకు తేలిపోయిందనే చెప్పాలి. పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ ని మ్యాచ్ చేయడంలో సినిమా మేకర్స్ చాలా వరకు తడబడ్డారు. అందువల్లే ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ విషయంలో ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాలేదు. అంత ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి చాలా వరకు మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని జూనియర్ ఎన్టీయార్ ఒక్కడే తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ చాలా బాగా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపడానికి తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. ఇక రెండు క్యారెక్టర్లలో ఉన్న వేరియేషన్స్ ను కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఇక ఆయన డైలాగ్ డెలివరీ గాని, డాన్సులు గాని ఈ తరంలో ఉన్న ప్రేక్షకులందరికి నచ్చే విధంగా ఉండేలా చూసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ప్రతి సీన్ లో తన ఐడెంటిటీ మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ చాలా బాగుంది… ఇక జాన్వీ కపూర్ స్క్రీన్ అప్పిరియన్స్ బాగున్నప్పటికీ ఆమె యాక్టింగ్ లో అంత ఈజ్ అయితే కనిపించలేదు. ఏదో ఆర్టిఫిషియల్ ఆర్టిస్ట్ గానే కనిపించింది తప్ప ఎక్కడ వావ్ అనిపించలేదు.

బహుశా ఆ క్యారెక్టర్ వల్లే ఆమెకు అలాంటి ఒక ఫీల్ అయితే వచ్చిందేమో…ఆమె తన పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా నటన మీద ఎలాంటి మక్కువ అయితే ఉందో మరోసారి చూపించాడు. ముఖ్యంగా పర్ఫెక్షనిస్ట్ గా మంచి పేరు పొందిన సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా కోసం చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక మొత్తానికైతే తనను తాను విలన్ పాత్రలో మరొకసారి భారీ రేంజ్ లో పోట్రే చేసుకున్నాడు… ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయం లో మాత్రం అక్కడక్కడ కొన్ని మెరుపులు అయితే మెరిపించాడు. ఇంకా ఫుల్ ఫ్లేడ్జ్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా ఇచ్చినట్టైతే సినిమా అవుట్ పుట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది. డిఓపి రత్నవేలు వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది.

ఆయన ప్రతి సీనుకి ఒక డిఫరెంట్ మోడ్ అయితే క్రియేట్ అయ్యేలా చేసి ప్రేక్షకుడిని థ్రిల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు…కొన్ని షాట్స్ అయితే చాలా కొత్త గా ఉండటమే కాకుండా ఆడియెన్స్ అందరిని వావ్ అనిపించేలా ఉన్నాయి. అలాంటి డిఫరెంట్ షాట్స్ ని కూడా ఈ సినిమాలో వాడారు. ఈ విషయం లో నిజంగా ప్రతి ఒక్కరు సినిమా సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు గారిని మెచ్చుకోకుండా ఉండలేరు…

ప్లస్ పాయింట్స్

ఎన్టీయార్
ఇంటర్వెల్ సీన్
కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది…
విలన్ క్యారెక్టరైజేషన్ బాగాలేదు…
కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వర్క్ అంత బాలేదు…

రేటింగ్

ఈ సినిమా కి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్
దేవర ఒకసారి మాత్రం చూడవచ్చు…

Devara Release Trailer (Telugu) | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva | Anirudh | Sep 27