https://oktelugu.com/

Devara Twitter Review : దేవర ట్విట్టర్ రివ్యూ: రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ బద్దలు కొట్టాడా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడా లేదా? అనేది తెలియాలంటే... పూర్తి రివ్యూ రావాల్సిందే..

Written By:
  • S Reddy
  • , Updated On : September 27, 2024 / 07:19 AM IST

    Devara Twitter Review

    Follow us on

    Devara Twitter Review : ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 27న విడుదల చేశారు. యూఎస్ లో ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. దీంతో పబ్లిక్ సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ఎన్టీఆర్ దేవర అంచనాలు అందుకుందా?

    రాజమౌళి హీరోలను ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయనతో మూవీ చేస్తే బ్లాక్ బస్టర్. అయితే రాజమౌళి చిత్రం తర్వాత ఏ దర్శకుడితో చేసినా, ఆ మూవీ ప్లాప్ అవుతుంది. రాజమౌళి మూవీ అనంతరం ప్రతి హీరోకి ప్లాప్ పడింది. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవరతో ఆ సెంటిమెంట్ అధిగమించాడా? ఆడియన్స్ అభిప్రాయంలో దేవర చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

    దర్శకుడు కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర తెరకెక్కించాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా .. దేవ్ పాత్రను చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడు. ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలుగుతాయట. రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతం చేశాడని అంటున్నారు.

    దేవరకు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ. ఫస్ట్ చాలా బాగుందని అంటున్నారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఆయన బీజీఎమ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే మాట వినిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రకు న్యాయం చేశాడని అంటున్నారు.

    ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు క్లైమాక్స్, దాని ముందు వచ్చే ట్విస్ట్ అలరిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యింది. స్టోరీలో కొత్తదనం లేదు అనేది కొందరు ఆడియన్స్ అభిప్రాయం. ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడా లేదా? అనేది తెలియాలంటే… పూర్తి రివ్యూ రావాల్సిందే..