Jr NTR Forget Megastar: నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘వార్ 2′(War 2 Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు హీరోలను ఒకే చోట చూడడం అభిమానులకు కనుల విందే, ఒకరి గురించి ఒకరు ఎంతో అద్భుతంగా మాట్లాడుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మాటలు మాత్రం చాలా వరకు అతిశయం అనిపించింది. మరీ ఇంత అతిగా మాట్లాడడం అవసరమా అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ ఏకిపారేస్తున్నారు. ముందుగా ఆయన హృతిక్ రోషన్(Hrithik Roshan) గురించి మాట్లాడుతూ ‘ దేశం లో ది బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమే..ఆయన తర్వాతే ఎవరైనా’ అనే అర్థం వచ్చేట్టు మాట్లాడాడు. దీనికి హృతిక్ రోషన్ కూడా ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతున్నప్పుడు వెనుక నుండి నేను కాదంటూ చేతులు ఊపాడు. ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇష్టం అయ్యుండొచ్చు, హృతిక్ అభిమాని కూడా అయ్యుండొచ్చు, కానీ ఆయన మనసులో ఉన్న మాట ని ఫైనల్ స్టేట్మెంట్ గా రుద్దడం ఎంత వరకు కరెక్ట్?.
Also Read: ఏపీ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. ఇంతకీ ఏం జరిగింది..
ఇదంతా పక్కన పెడితే మన ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లాంటోడిని పెట్టుకొని ఎక్కడో బాలీవుడ్ లో ఉన్న నటుడిని కేవలం నువ్వు అతనితో కలిసి నటించినంత మాత్రానా దేశం లోనే నెంబర్ 1 డ్యాన్సర్ అని అనేస్తావా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎన్టీఆర్ ని నిలదీస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు, ఇండియా లోనే డ్యాన్స్ కి స్పీడ్, స్టైల్, గ్రేస్ ని తీసుకొచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీ లోకి రాకముందు హీరోలు డ్యాన్స్ వేస్తున్నారా లేదా ఫైట్ చేస్తున్నారా అనే అయ్యోమయ్యం లో ఉండేవారు. కేవలం అక్కినేని నాగేశ్వర రావు వి మాత్రమే డ్యాన్స్ గా జనాలకు అనిపించేవి. కానీ మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం వచ్చింది.
Also Read: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనాలు లేరంటూ ట్రోల్స్..కానీ అసలు వాస్తవం ఇదే!
ఎన్టీఆర్ దృష్టిలో నెంబర్ 1 డ్యాన్సర్ అయినటువంటి హృతిక్ రోషన్ కూడా ఎన్నో సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి నే డ్యాన్స్ లో నెంబర్ 1 , ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . డ్యాన్స్ సరికొత్త పద్దతి లో రూపాంతరం చెంది, నేడు ఈ స్థాయికి వచ్చిందంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి నే. అంతే కాదు ఇండియన్ సినిమాకు బ్రేక్ డ్యాన్స్ వంటి కొత్త ఫార్మ్స్ ని పరిచయం చేసింది కూడా మెగాస్టార్ చిరంజీవి నే. ఇలాంటి అద్భుతాన్ని మన ఇండస్ట్రీ లో పెట్టుకొని, బయట వాళ్ళని లేపడం ఏంటో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ మొదటి నుండి ఇలాంటి అతిశయానికి పరాకాష్టగా మారిపోయాడని, ఇలా ఉంటే కష్టం అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
