BJP Counterattack Response: ఓటు చోరీ అంటూ ఇటీవల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం జత కూడిందని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఒక కుటుంబానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక ఉదాహరణగా చూపించారు. ఇన్ని దొంగ ఓట్ల వల్లే బిజెపి అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు!
రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. మీ వద్ద ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆ నోటీసులలో పేర్కొంది. అయితే దీనిపై ఇంతవరకు రాహుల్ గాంధీ ఎటువంటి ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. పైగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నాయకులు మరో విధంగా స్పందించారు..”ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని మీరే అంటారు. ఆ తర్వాత దొంగ ఓట్లు సృష్టించారని మీరే చెబుతారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే దొంగ ఓట్లు ఉన్నాయని చెబుతారు. అలాంటప్పుడు అది మీ పరిపాలన వైఫల్యం కిందే లెక్క కదా అని” బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.
ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు సోమవారం ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇతర విపక్ష పార్టీల ఎంపీల వరకు అందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని ప్రత్యేక బస్సులలో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రతిపక్ష ఇండియా కూటమినేతల అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read: పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో అంతగా గింజుకోవల్సింది ఏముంది షర్మిల గారూ
కాంగ్రెస్ నేత చేసిన విమర్శల నేపథ్యంలో బిజెపి నాయకులు కూడా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయాల్లోకి లాగడం రాహుల్ గాంధీ దౌర్భల్య మనస్తత్వానికి నిదర్శనమని బిజెపి నాయకులు అంటున్నారు. అంతేకాదు వరస ఓటములతో రాహుల్ గాంధీలో అసహనం పెరిగిపోయిందని.. అందువల్లే ఇలా తర్కం లేకుండా మాట్లాడుతున్నారని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రం తదుపరి అడుగులు ఎలా వేస్తుంది? ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.