Nidhhi Agerwal Viral News: ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ప్రముఖ నటి నిధి అగర్వాల్ కనిపిస్తున్నారు. కాకపోతే ఆ వాహనం ఏపీ ప్రభుత్వానికి చెందింది. ఇటీవల నిధి అగర్వాల్ విజయవాడకు వచ్చారు. తన వ్యక్తిగత పనిమీద ఆమె పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలో ఆమె ఏపీ ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించారు. ఏపీ ప్రభుత్వ వాహనాలలో నిధి అగర్వాల్ ప్రయాణించడాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు.
Also Read: ఉత్తరాంధ్ర జానపదాల పుట్టినిల్లు.. అక్కడికి వెళ్తే కళాకారుల దశ తిరిగినట్టే!
నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు సినిమాలో కథానాయకగా నటించారు. అంతేకాదు ఆ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. సహజంగా పవన్ కళ్యాణ్ అంటే వైసిపికి ఇప్పుడు విపరీతమైన ద్వేషం. అందువల్లే నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడాన్ని ఆ పార్టీ తప్పుపడుతోంది. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన వాహనాలలో ఓ ప్రైవేటు వ్యక్తి ప్రయాణించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే ఏపీ ప్రభుత్వం నిధి అగర్వాల్ సేవలో తరించిందని ఆరోపిస్తున్నారు..
వాస్తవానికి నిధి అగర్వాల్ విజయవాడ ఎందుకు వచ్చారో తెలియదు.. ఆమె ప్రభుత్వ వాహనాలను ఎందుకు ఉపయోగించారో తెలియదు.. ప్రభుత్వ వాహనాలలో ఆమె ఎందుకు ప్రయాణించారో కూడా తెలియదు.. కాకపోతే దీని వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్ అని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూచనలతోనే ఏపీ ప్రభుత్వ అధికారులు ఆమెకు రాజ లాంఛనాలతో స్వాగతం పలికారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు నిధి అగర్వాల్ ప్రయాణించిన కారును.. అందులో ఆమె దిగివస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
హరిహర వీరమల్లు సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ నిధి అగర్వాల్ విజయవాడ రావడం సంచలనం కలిగిస్తోంది. ఒకవేళ ఆమె విజయవాడ వచ్చినప్పటికీ ఏదైనా ప్రైవేట్ వాహనంలో తన కార్యకలాపాలను సాగిస్తే బాగుండేది. అలాకాకుండా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం.. ఆ వీడియో వైసిపికి దొరకడంతో ఇప్పుడు వివాదం ఏర్పడింది. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ప్రభుత్వ వాహనం
ఇటీవల విజయవాడ నగరంలో ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ సందడి చేసిన నిధి అగర్వాల్
సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు pic.twitter.com/msbn8zGl3U
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2025