Narasimha Naidu re-release : నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ చరిత్ర లో బెస్ట్ మాస్ సినిమా గా నిలిచి అందరి హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టమైన సినిమాగా నిల్చిన చిత్రం నరసింహ నాయుడు. 2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం కొల్లగొట్టి ఆల్ టైం నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల సినిమాగా నిలిచింది.
అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 10 వ తారీఖున ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రీ రిలీజ్ తో బాలయ్య బాబు ఇప్పటి వరకు ఉన్న రీ రిలీజ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతారని ఫ్యాన్స్ ఆశించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.
కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ గత ఏడాది విడుదలైన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం తో పోలిస్తే పావు శాతం కూడా లేదట. చాలా చోట్ల కనీసం పది టికెట్స్ కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా సోషల్ మీడియా లో చోటు చేసుకున్న ఎన్టీఆర్ మరియు బాలయ్య ఫ్యాన్ వార్స్ వల్లే అంటున్నారు విశ్లేషకులు. పెద్ద ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం దగ్గర నుండి ఈ గొడవ మొదలైంది.
సోషల్ మీడియా లో ఒకరినొకరు చాలా నీచంగా తిట్టుకున్నారు. దాని పరిణామమే ఈ వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ కి కారణమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడడం వల్లే బాలయ్య కి ఈమధ్య ఓపెనింగ్స్ వస్తున్నాయని, వాళ్ళ సపోర్టు లేకపోతే బాలయ్య పరిస్థితి ఇలా అయిపోతుంది అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.