Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Movie Updates: ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ నుండి తప్పుకున్న టోనీవో థామస్..కారణం ఏంటంటే..

NTR Dragon Movie Updates: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ నుండి తప్పుకున్న టోనీవో థామస్..కారణం ఏంటంటే..

NTR Dragon Movie Updates: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో చేస్తున్న ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి కంటెంట్ కూడా బయటకు రాలేదు, కనీసం టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా రికార్డు స్థాయిలో ప్రీ […]

NTR Dragon Movie Updates: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో చేస్తున్న ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి కంటెంట్ కూడా బయటకు రాలేదు, కనీసం టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఓవర్సీస్ అయితే ఏకంగా 70 కోట్ల రూపాయిలను ఆఫర్ చేస్తున్నారు బయ్యర్స్. ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం ప్రశాంత్ నీల్. ఆయన సినిమాలకు డొమెస్టిక్ మరియు ఓవర్సీస్ మార్కెట్స్ లో రాజమౌళి కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే , ఇక రాబోయే రోజుల్లో కంటెంట్ వచ్చిన తర్వాత ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో మీరే ఊహించుకోండి.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ విలన్ గా నటించబోతున్నట్టు చాలా కాలం నుండి ఒక వార్త ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే నేడు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో టోనీవో థామస్ ని ఇదే ప్రశ్న ఒక విలేఖరి అడగ్గా , అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘డేట్స్ సర్దుబాటు అవ్వలేదు. అందుకే ఆ చిత్రం నుండి తప్పుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా నేను మలయాళం లో ఒకే సమయం లో మూడు నుండి నాలుగు ప్రాజెక్ట్స్ చూస్తుంటానని, కానీ టాలీవుడ్ లో కేవలం ఒక్క ప్రాజెక్ట్ కోసం రెండు నుండి మూడేళ్ళ సమయం కేటాయించాల్సి వస్తుందని, అందుకే తెలుగు లో నాకు నటించాలని కోరికగా ఉన్నప్పటికీ, ఈ కారణాల చేత నటించలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు. టోనీవో మాట్లాడిన ఈ మాటలు పెద్ద దుమారమే రేపాయి.

పరోక్షంగా ఆయన టాలీవుడ్ సినీ పరిశ్రమ మేకర్స్ పై విమర్శలు చేసాడు. రీసెంట్ గానే ఈ మూవీ టీం జోర్దాన్ లో ఒక నెల రోజుల పాటు షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ కేవలం రెండు వారాలకే తిరిగి రావాల్సి వచ్చింది. కారణం ఏంటో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు కానీ, ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎన్టీఆర్, టోనీవో థామస్ మధ్య మూడు యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారట. కానీ టోనీవో చివరి నిమిషం లో తప్పుకోవడం తో కేవలం రెండు వారాల సన్నివేశాల షూటింగ్ ని పూర్తి చేసుకొని బయటకు రావాల్సి వచ్చిందట. మరి ఇప్పుడు టోనీవో స్థానం లో ఏ హీరో రాబోతున్నాడో చూడాలి. అభిమానులు విజయ్ సేతుపతి అయితే వేరే లెవెల్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ మనసులో ఎవరున్నారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper