https://oktelugu.com/

Kalyan Ram: ఎన్టీఆర్ వద్దన్నా.. దేవర విషయం లీక్ చేసిన కల్యాణ్ రామ్..!!

డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్, సత్య వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 13, 2023 / 05:23 PM IST

    Kalyan Ram

    Follow us on

    Kalyan Ram: తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి హీరోలకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోల్లో కల్యాణ్ రామ్ ఒకరు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డెవిల్’. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కాబోతుండగా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

    డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్, సత్య వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెత్ తో తెరకెక్కిన మూవీని దేవాన్ష్ నామా, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మించారు.

    డెవిల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులతో ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారని తెలుస్తోంది.

    ట్రైలర్ లాంచ్ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడారు. ఇటీవల ఆయన నటించిన బింబిసార చిత్రం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే బింబిసార సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు. బింబిసార -2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. రానున్న మే నెలలో బింబిసార -2 నిర్మాణ పనులు మొదలుకానున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తామని స్పష్టం చేశారు.

    అనంతరం ఎన్టీఆర్ మూవీ దేవర గురించి కల్యాణ్ రామ్ మాట్లాడారు.దేవర గురించి మాట్లాడొద్దని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారన్న ఆయన ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు మించి వేరే సినిమా తీయాలంటే నటులు, దర్శకులపై ఎంతో బాధ్యత ఉంటుందని చెప్పారు. కథ, విజువలైజేషన్ వంటి వాటిలో తప్పు జరిగితే ప్రేక్షకులు ఊరుకోరన్న ఆయన తెలిసి తప్పు చేయమని స్పష్టం చేశారు… బింబిసార, ఆర్ఆర్ఆర్ తరహలోనే దేవర ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందని తెలిపారు. అయితే ఇందుకోసం అభిమానులు, ప్రేక్షకులు మరి కొంత సమయం ఓపిక పట్టాలని విన్నవించారు. త్వరలోనే గ్లింప్స్ రాబోతున్నాయని, ఇందుకు సంబంధించిన డేట్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.