Devi Putrudu Child Artist: దేవి పుత్రుడు చిన్నారి ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? ఫోటోలు వైరల్!

మణిశర్మ స్వరపరిచిన 'ఆ కృష్ణుడు ఏలిన ద్వారక' సాంగ్ భలే ఉంటుంది. ఓ చిన్న పాప, వెంకటేష్ ఆ పాటలో కనిపిస్తారు. ద్వారకలో వెంకటేష్ ని అపాయాల నుండి కాపాడే చిన్న పిల్ల ఆత్మ పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Written By: NARESH, Updated On : December 13, 2023 5:21 pm

Devi Putrudu Child Artist

Follow us on

Devi Putrudu Child Artist: 2001లో వచ్చిన దేవి పుత్రుడు వెంకటేష్ కెరీర్లో మంచి చిత్రాల్లో ఒకటని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. దేవి పుత్రుడు, నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మృగరాజు ప్లాప్. దర్శకుడు కోడి రామకృష్ణ కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ తో మాయ చేశాడు. మణిశర్మ బీజీఎమ్ సాంగ్స్ కూడా మెప్పించాయి.

ఈ మూవీలో మణిశర్మ స్వరపరిచిన ‘ఆ కృష్ణుడు ఏలిన ద్వారక’ సాంగ్ భలే ఉంటుంది. ఓ చిన్న పాప, వెంకటేష్ ఆ పాటలో కనిపిస్తారు. ద్వారకలో వెంకటేష్ ని అపాయాల నుండి కాపాడే చిన్న పిల్ల ఆత్మ పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పసి ప్రాయంలో చాలా క్యూట్ గా నటించింది ఆ పాప. కథలో కీలకమైన ఆ పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

ఆ పాప పేరు వేగ తమోతియా. 23 ఏళ్ల క్రితం చిన్న పాపగా ఉన్న వేగ ప్రస్తుత వయసు పాతికేళ్ళకు పైనే. అప్పటి ఆ క్యూట్ పాప ఇప్పుడు ఎలా ఉండనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. వేగ పెద్దయ్యాక కూడా నటననే కెరీర్ గా ఎంచుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించడం విశేషం. తెలుగులో హ్యాపీ హ్యాపీగా, హౌస్ఫుల్ చిత్రాల్లో ఆమె నటించింది.

అలాగే హిందీలో కొన్ని చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో వేగ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. వేగ హీరోయిన్ గా బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ప్రయత్నాలు చేస్తుంది. విశేషం ఏమిటంటే… వేగ నిర్మాతగా కూడా రాణిస్తుంది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ చిత్రాలను వేగ నిర్మించారు. వేగ సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి.