Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫినాలే వీక్ ఎమోషనల్ గా నడిపిస్తున్నారు. టాప్ 6 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు వరుసగా చూపిస్తూ వాళ్ళని సర్ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా సోమవారం రోజు అమర్ దీప్, అర్జున్ ల జర్నీ వీడియోలు విడుదల చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంక ల జర్నీ ఎమోషనల్ గా సాగింది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రోమోలో ప్రిన్స్ యావర్ తన జర్నీ చూసి తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు.
ఇక యావర్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలకు పొంగిపోయాడు. అతని గొప్పతనాన్ని బిగ్ బాస్ వివరిస్తూ .. మీరు ఏదైనా ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దపడే గుణం అందరికీ నచ్చింది. టాస్క్స్ లో మీకు ఎవరూ పోటీ కాదు అనే విధంగా ప్రతి టాస్క్ లో ఇరగదీసారు. యావర్ తో పోటీ అంటే ఆలోచించాల్సిందే అనేట్టుగా చేశారు. మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహద పడింది.
మీ కోపం .. మీ పట్టుదల .. మీకు తప్పు కనిపించిన ప్రతి చోటా కనిపించాయి. అదే ధైర్యం మీరు ఏవిక్షన్ పాస్ సాధించేలా చేసింది. ఆ పాస్ ని తిరిగి ఇచ్చేసినపుడు నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.
తన క్యారెక్టర్ ముఖ్యం అనుకోని ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసిన యావర్ కి బిగ్ బాస్ నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో యావర్ చిన్న పిల్లాడిలా తెగ ఏడ్చేశాడు. నిజానికి అతనికి తెలుగు రాకపోయినా .. ఒక తెలుగు షో లో ఇన్ని రోజులు తన జర్నీ కొనసాగించాడు. ఫైనలిస్ట్ గా నిలిచాడు. టైటిల్ రేస్ లో లేకపోయినా .. ఒక నిజాయితీ ఉన్న మనిషిగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు ప్రిన్స్ యావర్.