https://oktelugu.com/

NTR: మహేష్ బాబు బిజినెస్ లు చూసుకుంటున్న ఎన్టీయార్ డైరెక్టర్…

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోగా మారాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 12:12 PM IST

    NTR(9)

    Follow us on

    NTR: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన రాజమౌళితో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేయబోయే ప్రతి ఆక్టివిటీ కూడా ఆ సినిమాకు సంబంధించిందే కావడం విశేషం… ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్లు మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ సినిమా యూనిట్ అయితే క్లారిటీ ఇచ్చారు…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలనే కాకుండా బిజినెస్ రంగంలో కూడా భారీగా రాణిస్తున్నారునే విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకు ఏఎంబి మాల్ తో పాటు వివిధ రకాల బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇక వాటన్నింటినీ చూసుకోవడానికి ఆయన భార్య అయిన నమ్రత ఉన్నప్పటికీ తనతో పాటుగా మరొక వ్యక్తి కూడా ఆ.బిజినెస్ పనులను చూసుకుంటాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆయన ఎవరు అంటే ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి లాంటి భారీ ప్లాప్ సినిమాలను తీసిన మెహర్ రమేష్…

    నిజానికి మెహర్ రమేష్ కి మహేష్ బాబు కి మొదటి నుంచి కూడా చాలా మంచి అనుబంధమైతే ఉంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధంతోనే వీరిద్దరూ బాబీ సినిమాలో కలిసి నటించారు. అయినప్పటికీ మహేష్ బాబు మెహర్ రమేష్ తో సినిమా మాత్రం చేయలేదు. కారణం ఏంటి అంటే కంత్రి సినిమా చేసి సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత మహేష్ బాబు మెహర్ రమేష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు.

    కానీ కంత్రి సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేదు. కాబట్టి ఆయనతో సినిమా చేయకపోవడమే ఉత్తమం అని మహేష్ బాబు అతని నుంచి తప్పుకున్నాడు. దాంతో అప్పటినుంచి మహేష్ బాబు తోనే ట్రావెల్ అవుతున్న మెహర్ రమేష్ ప్రస్తుతం తన బిజినెస్ పనులను చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు.

    ఇక గత సంవత్సరం చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసిన మెహర్ రమేష్ ఆ సినిమాతో సక్సెస్ ని సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇక మెహర్ రమేష్ సినిమాలు చేయడానికి పనికి రాడు అంటూ అతని మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక ముద్ర అయితే వేసింది. ఇక ఆయనతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు గాని, హీరోలు గాని ఎవ్వరూ ముందుకు రాకపోవడం విశేషం…