https://oktelugu.com/

Thangalaan: ఆస్కార్ రేస్ లో నిలువనున్న తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్…అవార్డు దక్కుతుందా..?

సినిమా అనేది ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉన్నప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. అందులో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా కథ విషయంలో గానీ, దర్శకుడు మేకింగ్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సినిమా అనేది షెడ్డు కి వెళ్తుందనే చెప్పాలి... ముఖ్యంగా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడానికి చాలా సినిమాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 12:02 PM IST

    Thangalaan(1)

    Follow us on

    Thangalaan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత అంత మంచి పేరు సంపాదించుకున్న హీరో విక్రమ్.. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రొటీన్ రెగ్యూలర్ కథలను చేయడానికి ఆయన ఇష్టపడడు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే అలాంటి సినిమాల్లో నటించినప్పుడే తన నటన ప్రతిభా అనేది బయటపడుతుందని తద్వారా ప్రేక్షకులు తనని ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటాడు. అందుకోసమే సినిమా ఏదైతే కావాలనుకుంటుందో దానికోసం ఎంతవరకైనా వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం లో కూడా ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటాడు. అందుకే ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ప్రతి సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన సినిమాలన్నీ ఒక క్లాసికల్ సినిమాలుగా మిగిలిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన పా రంజిత్ డైరెక్షన్ లో చేసిన ‘తంగలాన్ ‘ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకులందరి చేత ప్రశంశింపబడుతుంది.

    ఇక ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి ఇలాంటి సినిమాలు వస్తే ఆదరించడానికి మేము రెడీగా ఉన్నాం అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం సినిమా దక్కించుకున్న సక్సెస్ ని తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. పాన్ ఇండియా సబ్జెక్టుగా వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. తద్వారా విక్రమ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి.

    ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తంగలాన్ సినిమా ఆస్కార్ రేసులో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కనుక ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిస్తే తప్పకుండా ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందని చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికైతే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు చూపించిన ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందనే చెప్పాలి…