https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ పై షాకింగ్ అప్డేట్… కొరటాల శివ అలా ప్లాన్ చేశాడా!

దేవర వాయిదా అనివార్యం అని పలువురు భావిస్తున్నారు. అయితే వీలైనంత వరకు చెప్పిన తేదీకి వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో త్వరితగతిన షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

Written By:
  • S Reddy
  • , Updated On : February 13, 2024 / 02:45 PM IST
    Follow us on

    NTR: ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు కావస్తుంది. ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక్క మూవీ మాత్రమే. ఫ్యాన్స్ ఆయన లేటెస్ట్ మూవీ దేవర కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా దేవర విడుదల కానున్నట్లు ప్రకటించారు. అయితే దేవర వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీని ఇదే తేదికి ప్రకటించారు. దీంతో దేవర వాయిదా అనివార్యం అని పలువురు భావిస్తున్నారు.

    అయితే వీలైనంత వరకు చెప్పిన తేదీకి వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో త్వరితగతిన షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఫిబ్రవరి 16న లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కానుందట. టాకీ పార్ట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. టాకీ పార్ట్ కంప్లీట్ అయిన వెంటనే బ్యాలన్స్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తారట. చివర్లో పాటలు తెరకెక్కిస్తారట.

    షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. దర్శకుడు కొరటాల శివ సమ్మర్ కే దేవరను విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట. అయితే ఎంత వరకు ఆయన ప్రయత్నం నెరవేరుతుంది అనేది చూడాలి. దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. దేవర రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

    ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. దేవర మూవీ విజయంతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నారు. దేవర సాగరతీరం నేపథ్యంలో తెరకెక్కుతుంది. విడుదలైన టీజర్ గూస్ బంప్స్ లేపింది.