NTR Comments On RRR Movie: అలా ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఒప్పుకునే వాడిని కాదు – ఎన్టీఆర్

NTR Comments On RRR Movie: ఈ నెల 25న విడుదల కానున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారతీయ సినీ లోకం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొత్త సంచనాలను సృష్టించడానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యింది. మరోపక్క ఈ చారిత్రాత్మక చిత్రానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పడానికి చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఒకవేళ రాజమౌళి కాకుండా […]

Written By: Shiva, Updated On : March 15, 2022 6:48 pm
Follow us on

NTR Comments On RRR Movie: ఈ నెల 25న విడుదల కానున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారతీయ సినీ లోకం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొత్త సంచనాలను సృష్టించడానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యింది. మరోపక్క ఈ చారిత్రాత్మక చిత్రానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పడానికి చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

NTR Comments On RRR Movie

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఒకవేళ రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్‌ డైరెక్షన్ చేసి ఉండి ఉంటే.. నేను ఈ సినిమాలో నటించేవాడిని కాదు. అయితే, ఇలాంటి అద్భుత కథ చేయడం ఒక్క జక్కన్నకే సొంతం. ఏ డైరెక్టర్ ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి కథను రాయలేడు. రాసే సాహసం కూడా చేయడు.

Also Read: అనసూయకి వార్నింగ్‌ ఇచ్చిన చిరంజీవి.. కారణం అదే

ఈ సినిమా చేసిన అనుభవంతో చెబుతున్నాను. ఇక పై మల్టీస్టారర్‌ సినిమాలు ఎక్కువుగా వస్తాయి. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే.. మల్టీస్టారర్‌ చేయాలంటే బలమైన కథలు రావాలి. అలాంటి కథలు వచ్చి, ఆ దర్శకుడు డీల్‌ చేయగలడు అనే నమ్మకం కలిగితే కచ్చితంగా నేను మల్టీస్టారర్‌ లు చేస్తాను.

నాకు అయితే, బాలయ్య బాబాయ్‌, మహేశ్‌ బాబు, చిరంజీవి, వెంకటేశ్‌, ప్రభాస్‌.. ఇలా అందరితో కలిసి నటించాలని ఉంది’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎన్టీఆర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ కు మరో ఘనత దక్కింది. ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రపంచంలోనే అతిపెద్ద తెర పై పడనుంది. యూకేలోని ఓడియన్ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌ థియేటర్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనుండటం విశేషం.

NTR Comments On RRR Movie

అలాగే యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేయనుంది. యూకేలో ఒక ఇండియన్ మూవీ వెయ్యి స్క్రీన్స్‌లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాలోని హైలైట్స్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ఓ చర్చ జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పైగా ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట.

ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ను హైలైట్ చేయడానికి మొదటి నుంచి క్రేజీగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. దీనికితోడు సహజంగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. పైగా రాజమౌళి టేకింగ్, షాట్ మేకింగ్ అదిరిపోతుంది. అందుకే సినిమాలో ఎన్టీఆర్ చేసిన ప్రతి సీన్ విజువల్ వండర్ గా ఉంటుందట.

Also Read: కొత్త వారికే జగన్ మంత్రివర్గంలో చాన్స్ దక్కనుందా?

Tags