Hero Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా లెక్కల వ్యవహారం అస్సలు బాగాలేదు. విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి పడిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ భారీ ఫ్లెక్సీ కట్టే క్రమంలో చనిపోయాడు.
ఫ్లెక్సీ అనుకోకుండా విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దాంతో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ బాధాకరమైన సంఘటన గురించి ప్రభాస్ ఫ్యాన్స్ మరియు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. తన అభిమాని చావు వార్త విన్న ప్రభాస్ చలించిపోయాడు.
Also Read: అలా ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఒప్పుకునే వాడిని కాదు – ఎన్టీఆర్
వెంటనే ప్రభాస్ చనిపోయిన చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట ఇస్తూ.. చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి భవిష్యత్తులో ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. ముందు నుంచీ తన అభిమానుల విషయంలో ప్రభాస్ చాలా దయగలిగి ఉంటాడు.
అలాగే, కేరళ, ఏపీ వరదల్లో చిక్కుకున్నప్పుడు కూడా పలుసార్లు ఆర్థిక సాయం చేసాడు. ఇలా ప్రభాస్ ఎప్పుడూ తనవంతు సాయం చేస్తూనే ఉంటాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక, యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు.
ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. కానీ చివరకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. పైగా ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా ఒక్కఫైట్ కూడా లేకుండా చేసిన సినిమానే ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను బాగా నిరాశ పరిచింది.
Also Read: ఏ హీరో బాడీగార్డ్ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా ?