https://oktelugu.com/

మంచు మనోజ్ పై ఎన్టీఆర్ కామెంట్స్.. అవాక్కవాల్సిందే..!

మన హీరోల బెస్ట్ ఫ్రెండ్స్ గురించి సాధారణంగా ఎవరికీ పెద్దగా తెలియదు. హీరోలంతా ఎవరికీ వారు బీజీగా గడుపుతూ ఉంటారు. దీంతో వారి సినిమాల విషయాలు తప్పా.. పర్సనల్ విషయాలు పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. హీరోలను ఇంటర్వ్యూలు చేసినప్పుడు మాత్రమే వాళ్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడుతుంటాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ హీరోల బెస్ట్ ఫ్రెండ్స్.. వాళ్ల పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు మాత్రం అభిమానులు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 03:46 PM IST
    Follow us on


    మన హీరోల బెస్ట్ ఫ్రెండ్స్ గురించి సాధారణంగా ఎవరికీ పెద్దగా తెలియదు. హీరోలంతా ఎవరికీ వారు బీజీగా గడుపుతూ ఉంటారు. దీంతో వారి సినిమాల విషయాలు తప్పా.. పర్సనల్ విషయాలు పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. హీరోలను ఇంటర్వ్యూలు చేసినప్పుడు మాత్రమే వాళ్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడుతుంటాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    హీరోల బెస్ట్ ఫ్రెండ్స్.. వాళ్ల పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు మాత్రం అభిమానులు ఎల్లప్పుడూ ఆసక్తిని చూపుతూనే ఉంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ పై చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. మంచు మనోజ్.. ఎన్టీఆర్ వీళ్లద్దరు కూడా సినిమాల్లోకి రాక ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. ఇది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు.

    Also Read: బిగ్ బాస్-4: అనినాష్ కోసం అరియానా ఎమోషనల్.. అసలేం జరిగిందంటే?

    మంచు మనోజ్ తో స్నేహంగా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒక బ్రహ్మకథను వివరించాడు. బ్రహ్మదేవుడు ఒకసారి దీర్ఘంగా ఆలోచించి రెండు బొమ్మలను తయారు చేశాడని తెలిపారు. రూపాలు వేరైనా కూడా ఒకేలా ఆలోచించే బొమ్మలు అవని తెలిపాడు. ఈ రెండింటికి బ్రహ్మ ఒక పరీక్ష పెట్టాడని చెప్పారు. అల్లరి చేయకుండా వినయంగా ఉన్న బొమ్మను కిందకు పంపాలని అనుకున్నాడని అలా నేను భూమ్మిదకు వచ్చినట్లు తెలిపాడు.

    ఆ తర్వాత రెండో బొమ్మ బ్రహ్మదేవుడిని నన్ను ఎలాగూ కిందకు పంపవంటూ గిల్లడం ప్రారంభించింది. దీంతో అది భరించలేక సరిగ్గా మోహన్ బాబు ఇంట్లొనే పుట్టేలా చేశాడని తెలిపాడు. ఆ రెండో బొమ్మే మంచు మనోజ్ అని తెలిపాడు. నాటి నుంచి మనోజ్ గిల్లుడు తనకు మొదలైందని తెలిపాడు. మనోజ్ చేసిన పనులకు ఎన్నోసార్లు తాను ఇంట్లో బుక్కయ్యానని తెలిపాడు.

    Also Read: షూటింగ్ కు రెడీ అవుతున్న పుష్ప..!

    మేమిద్దరం ఒకే రోజు( 1983 మే 20)న జన్మించినట్లు చెప్పాడు. మనోజ్ తన కంటే ఆరుగంటలే చిన్నవాడని.. అయినా తనకు ఎప్పుడూ గౌరవం ఇవ్వడని ఎన్టీఆర్ తెలిపాడు. తామిద్దరం ఎలాంటి స్టేజ్లో ఉన్నా స్నేహంలో మాత్రం ఎలాంటి మార్పురాలేదని తెలిపాడు. కాగా వీరిద్దరు తొలిసారి మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగులో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.