https://oktelugu.com/

ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన మహిళ

అత్త, మరిధి వేధింపులు తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా ఓ మహిళ గోదావరిలో దూకిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. కొవ్వూరు అచ్చమ్మ కాలనీకి చెందిన వరికూటి సాయి అనే మహిళకు ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం అయింది. ఐదు నెలల కిందట ప్రసాద్ మరణించాడు. అప్పటి నుంచి అత్తింటి వారి వద్దే ఉంటున్న సాయి ని అత్త, మరిధిలు వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె కొవ్వూరు లోని భక్తాంజనేయ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2020 / 03:49 PM IST
    Follow us on

    అత్త, మరిధి వేధింపులు తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా ఓ మహిళ గోదావరిలో దూకిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. కొవ్వూరు అచ్చమ్మ కాలనీకి చెందిన వరికూటి సాయి అనే మహిళకు ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం అయింది. ఐదు నెలల కిందట ప్రసాద్ మరణించాడు. అప్పటి నుంచి అత్తింటి వారి వద్దే ఉంటున్న సాయి ని అత్త, మరిధిలు వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె కొవ్వూరు లోని భక్తాంజనేయ స్నాన ఘట్టంవద్ద గోదావరిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు తల్లిని, పెద్ద కుమార్తెను రక్షించారు. చిన్న కుమార్తె దర్శిని గల్లంతయింది.