https://oktelugu.com/

షూటింగ్ కు రెడీ అవుతున్న పుష్ప..!

దర్శకుడు సుకుమార్.. సైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. దీంతో ఆరేడు నెలలు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కావడంతో ‘పుష్ప’ కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ టాలీవుడ్లో యంగ్ హీరోలంతా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే స్టార్ హీరోలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 03:43 PM IST
    Follow us on

    దర్శకుడు సుకుమార్.. సైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. దీంతో ఆరేడు నెలలు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కావడంతో ‘పుష్ప’ కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    టాలీవుడ్లో యంగ్ హీరోలంతా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం కొంత వెనుకంజ వేస్తున్నారు. కొద్దిరోజులుగా స్టార్ హీరోలు సైతం సినిమాలను లైన్లో పెడుతుండటంతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    Also Read: బిగ్ బాస్-4: అనినాష్ కోసం అరియానా ఎమోషనల్.. అసలేం జరిగిందంటే?

    గత వారం క్రితమే ‘పుష్ప’ మూవీ ప్రారంభం కావాల్సి ఉండగా షూటింగ్ కోసం  వేసిన సెట్స్ పూర్తి కాలేదు. దీంతో మంగళవారం నుంచి ‘పుష్ప’ షూటింగ్ ప్రారంభించనునన్నట్లు చిత్రయూనిట్ ట్వీటర్లో అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ట్వీటర్లో షూటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్టు చేసింది.

    ఈ వీడియోలో దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్..యూనిట్ సభ్యులు షూట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ కన్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అటవీ ప్రాంతంలో రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

    Also Read: కాజల్ రోమాన్స్.. ఈసారి భర్తతో.. డంగవుతున్న ఫ్యాన్స్..!

    ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్.. ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తోంది. రేపటి నుంచి ‘పుష్ప’ మూవీ ప్రారంభం కానుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.