Nandamuri Taraka Ramarao: తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి నేడు. తెలుగు నెల ఆ మహనీయునికి ఘనంగా నివాళలర్పిస్తొంది. ఆ మహా నేతను తలుచుకుని అభిమానులు మురిసిపోతున్నారు. పైగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా జరపబోతున్నారు. ఐతే, నేటి తరానికి సీనియర్ ఎన్టీఆర్ నటనా విధానం గురించి తెలియదు. నటనలో ఎన్టీఆర్ పద్దతి వేరు. ఆయన ఏ పాత్ర అయితే, నటించాల్సి వస్తోందో.. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేవారు. బిచ్చగాడిలా నటించాల్సి వస్తే.. ఎన్టీఆర్ బిచ్చగాళ్ళతో కొన్నాళ్ళు స్నేహం చేసేవారు, ఒకవేళ మానసిక రోగిగా నటించాల్సి వస్తే కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో ఉండి వస్తారు. అడవి మనిషి వేషం వేయాలంటే పచ్చి మాంసాన్ని తినేవారు. ఇలాంటి పద్ధతులలో ఎన్టీఆర్ దిట్ట. ఇది మెథడ్ యాక్టింగ్. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ దేవతల పాత్రలు, అవతార పురుషుల పాత్రలు వేయాల్సి వస్తే.. మాంసాహారం ముట్టకుండా కేవలం శాకాహారమే తినేవారు. అలాగే మంచాల పై కాకుండా నేలపైనే పడుకునేవారు. ఇలా చేయడం వల్ల సాత్వికత అభివృద్ధి చెందుతుందనీ, రాక్షస లక్షణాలైన తామస గుణాల నుంచి మనసు దూరమై పరిశుద్ధంగా ఉంటుందని ఎన్టీఆర్ భావించేవారు.
Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి ఉన్న రిలేషన్ తెలుసా?
అంత గొప్పగా నిష్ఠగా ఉంటేనే.. ఆ తేజస్సు తన ముఖంలో ప్రతిఫలిస్తుందనీ ఎన్టీఆర్ గారు బాగా నమ్మేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన విశ్వాసం ఎన్నడూ ఒమ్ము కాలేదు. రాక్షస / ప్రతినాయక పాత్రలు పోషించేప్పుడు ఆ లక్షణాలు తనలో పొంగిపొర్లాలని ఎన్టీఆర్ విపరీతంగా మాంసాహారం తినేవారు. ఆయన మాంసం వండించుకుని తినే సమయంలో అక్కడ ఉన్నవారు ఎన్టీఆర్ గారిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఎన్టీఆర్ ఆ స్థాయిలో మాంసాన్ని తినేవారు. ఇలా ఒక పాత్ర పోషణలో భాగంగా, విపరీతమైన శారీరక కష్టాలను ఆహ్వానించి వాటికి ఓర్చడం మెథడ్ యాక్టింగ్ లో గొప్ప నియమం. సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి ఈ మెథడ్ యాక్టింగ్ ప్రధాన కారణం. ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే ఇలాంటివి అనేకం చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఎద్దు మీద పడే సన్నివేశం ఉంటే డూప్ అక్కరలేదని స్వయంగా చేసి కుడి చేయి విరగ్గొట్టుకున్నారు. ఆయనలో అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఇది. పాత్ర మానసిక స్థితిలోకి, భావోద్వేగంలోకి ప్రవేశించాకా, షాట్ గ్యాప్‌లో రామారావు ఇతరుల్లాగా వేరే పనుల్లోకి, సరదా కబుర్లలోకి దిగేవారు కాదు. ఆ పాత్ర భావోద్వేగమే అనుభవిస్తూ ఉండేవారు. అందుకే.. ఎన్టీఆర్ నట విశ్వరూపం సినీ విశ్వంలోనే శాశ్వతంగా నిలిచిపోయింది.
Also Read: Ponnur Politics: కిలారి వర్సెస్ ‘రావి’+టీడీపీ.. పొన్నూరులో వైసీపీ పతనానికి పక్కా ప్లాన్