https://oktelugu.com/

బిగ్‌ బాస్ కి బిగ్ షాక్ ఇచ్చిన నోయల్ !

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అనారోగ్య కార‌ణాల‌తో నోయ‌ల్‌ షో మ‌ధ్య‌లో నుంచే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా బిగ్‌బాస్‌కు నోయ‌ల్ షాక్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్ షో మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని అర్థ‌మైంద‌ని నోయల్ చెప్పుకొచ్చాడు. అస్స‌లు ఆ షోకు తాను ఎందుకెళ్లానో, ఏమో అనే ఫీలింగ్ తో బాధ పడుతున్న‌ట్టు చెప్పాడు. దీంతో ఆ షోను పూర్తిగా చూడ‌డ‌మే మానేసిన‌ట్టు నోయ‌ల్ తెలిపాడు. మరి నోయల్ బిగ్ బాస్ కి మధ్య ఏం జరిగిందో గాని […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 11:22 AM IST
    Follow us on


    బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అనారోగ్య కార‌ణాల‌తో నోయ‌ల్‌ షో మ‌ధ్య‌లో నుంచే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా బిగ్‌బాస్‌కు నోయ‌ల్ షాక్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్ షో మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని అర్థ‌మైంద‌ని నోయల్ చెప్పుకొచ్చాడు. అస్స‌లు ఆ షోకు తాను ఎందుకెళ్లానో, ఏమో అనే ఫీలింగ్ తో బాధ పడుతున్న‌ట్టు చెప్పాడు. దీంతో ఆ షోను పూర్తిగా చూడ‌డ‌మే మానేసిన‌ట్టు నోయ‌ల్ తెలిపాడు. మరి నోయల్ బిగ్ బాస్ కి మధ్య ఏం జరిగిందో గాని మొత్తానికి నోయల్ ఇలాంటి కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచాయి. నిజానికి ఆ మ‌ధ్య‌ త‌న రీఎంట్రీ ఉంటుంద‌ని హోరెత్తించాడు నోయల్.

    Also Read: రెడ్ పరిస్థితి ఏంటి ? ఓటీటీలోనా? థియేటర్ లోనా?

    గేమ్ ఈజ్ స్టిల్ ఆన్‌.. ఈసారి వెళ్తే మామూలుగా ఉండ‌దు అంటూ పోస్టులు పెట్టాడు కూడా. నోయల్ పోస్ట్ లు చూసి.. ఇక రీఎంట్రీ ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కానీ చివ‌రాఖ‌ర‌కు అదంతా ఉత్తిదే అని తేలడంతో.. మరి నోయల్ ఫీల్ అయ్యాడో ఏమో గాని.. మొత్తానికి బిగ్ బాస్ పై అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అన్నట్లు నోయల్ త‌న‌ స్నేహితుల‌కు స‌పోర్ట్ చేయ‌డం ప్రారంభించాడు. అభిజిత్‌, హారిక‌కు ఓటేయ‌మ‌ని ప్ర‌చారం చేప‌ట్టాడు. ఆ ఇద్ద‌రి గెలుపు గురించి అనునిత్యం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న నోయల్ ఎంతవరకు ఫలిస్తోందో చూడాలి.

    Also Read: సమంత బికినీ షో పై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ !

    ఇక ఎలిమినేట్ అయిన‌ కంటెస్టెంట్లు అంద‌రూ జోరుగా ఇంట‌ర్వ్యూలు చేస్తూ హడావుడి చేస్తుంటే.. నోయల్ మాత్రం వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా ఎక్క‌డో సిటీకి దూరంగా, రాష్ట్రానికి స‌రిహ‌ద్దులో ఉన్న నోయ‌ల్ నివాసానికి హారిక అన్న‌య్య వంశీ, ఆమె స్నేహితుడు, యాంక‌ర్‌ నిఖిల్ వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఉచ్ చేశారు. నోయ‌ల్‌కు చెప్పాపెట్ట‌కుండా అత‌డి ఇంటికి చేరుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్