https://oktelugu.com/

జీహెచ్ఎంసీలో కేసీఆర్ కు ఉద్యోగుల దెబ్బ

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా కొందరి కోరికలు మాత్రం కేసీఆర్ తీర్చడం లేదు. అసలు వారిని పట్టించుకోవడం లేదు. వారున్నారని కూడా గుర్తించడం లేదు. ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘మేమున్నామని గుర్తుంచు  అత్త’ అని పవన్ వేడుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు ఎన్ని సార్లు కేసీఆర్ ను కలుద్దామన్నా ఆయన దర్శనభాగ్యమే దొరకడం లేదు. పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వ్యతిరేకమయ్యారు.   అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో టీచర్లనే కేసీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 11:12 AM IST
    Follow us on


    తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా కొందరి కోరికలు మాత్రం కేసీఆర్ తీర్చడం లేదు. అసలు వారిని పట్టించుకోవడం లేదు. వారున్నారని కూడా గుర్తించడం లేదు. ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘మేమున్నామని గుర్తుంచు  అత్త’ అని పవన్ వేడుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు ఎన్ని సార్లు కేసీఆర్ ను కలుద్దామన్నా ఆయన దర్శనభాగ్యమే దొరకడం లేదు. పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వ్యతిరేకమయ్యారు.   అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో టీచర్లనే కేసీఆర్ దూరంగా పెట్టడం సంచలనమైంది. వారు దెబ్బతీస్తారనే ఇలా చేసినట్టు తెలుస్తోంది. మొత్తం కేసీఆర్ కు జీహెచ్ఎంసీ ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితం చూశాక ఉద్యోగుల దెబ్బ భారీగానే పడిందని చెప్పొచ్చు. 

    Also Read: ‘ఎగ్జిట్’ రివర్స్: బ్యాలెట్ లో కమల వికాసం.. స్పీడు తగ్గిన కారు

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ..  అసంతృప్తిని తగ్గించడానికి మున్సిపల్ ఉద్యోగులకు వరాలిచ్చి భర్తీ చేయాలని చూశారు.‌. పారిశుధ్య సిబ్బందికి అడక్కుండానే నెల జీతం 3 వేల రూపాయలు పెంచడాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా చూడాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏం వరాలు ఇవ్వలేకపోయారు. ఒక్క ఉద్యోగులకు వరాలిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనుకున్నారేమో.. వరదసాయం మరో 100 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నారు. మీ సేవా కేంద్రంలో పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు.. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఖాతాల్లో నేరుగా పరిహారం సొమ్ము జమ అవుతుందట.

    ఇటీవల రెవెన్యూ వ్యవస్థను భారీ ఎత్తున ప్రక్షాళన చేశారు. అందులో భాగంగా ఏకంగా వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికారు. ఆ నిర్ణయంతో తెలంగాణలోని అవినీతిని మొత్తం ఏరిపారేసినట్టు భారీ డైలాగులు కొట్టారు. సామాన్య ప్రజానీకంలో కొంతమంది ఈ నిర్ణయంతో సంతోషపడొచ్చు కానీ.. వారికిది ఓట్లు త్యాగం చేసేంత పెద్ద సంగతేం కాదు. అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధుగణం.. అందరూ కేసీఆర్‌‌కు బద్ద శత్రువుల్లా మారిపోయారు. తమ జీవితంలో ఇక టీఆర్‌‌ఎస్‌కు ఓటు వేసేది లేదంటూ డిసైడ్‌ అయిపోయారు. ఆ స్థాయిలో శత్రుత్వం పెంచుకున్నారు. ఇదంతా మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో చూపించారు కూడా.

    Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. స్వస్తిక్ ఓట్లను మాత్రమే లెక్కించాలని హైకోర్టు ఆదేశం..!

    రైతులు, పింఛన్ దారులు, గ్రామస్థులను గుప్పిట పట్టిన కేసీఆర్ తెలంగాణలో విద్యా, ఉద్యోగులు, యువతను మాత్రం పెడచెవిన పెట్టారు. ఆరేళ్లు అవుతున్నా ఉద్యోగాల ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ శాంతపరచలేదు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా పీఆర్సీ, టీఏ, డీఏ సహా అన్నింటిని కేసీఆర్ ఎగ్గొట్టాడనే ఫిర్యాదులున్నాయి. ఇక కరోనా వేళ ఉద్యోగులకు సగం జీతం ఇచ్చి వారిని నొచ్చుకునేలా చేశాడు. అందుకే ఇప్పుడు ఉద్యోగులంతా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బకొట్టారు.

    గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉద్యోగులను ఏ స్థాయిలో పీడించాడో అందరికీ తెలిసిందే. తర్వాత ఆయనకు వాళ్లే బుద్ధి చెప్పారనేది సుస్పష్టం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చేస్తోంది అదే. ఉద్యోగులతో పెట్టుకుంటేనే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి ఎదురైందనేది ఓ టాక్‌. వారితో పెట్టుకున్న పాపమే ఈ రిజల్ట్‌ అని బహిరంగంగా ఉద్యోగులు తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వారి దెబ్బ గట్టిగానే పడిందని పోస్టల్ బ్యాలెట్ చూశాక అర్థం అవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్