https://oktelugu.com/

హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి !

సింగర్ నోయల్ హీరోయిన్ ఏస్తర్ తో ప్రేమలో ఉన్నానని ప్రకటించినప్పుడే అందరూ షాక్ గురయ్యారు. అసలు వీరిద్దరికీ ఎలా కుదిరింది ప్రేమా అని. ఆ తరువాత ఈ జంట పెళ్లి కూడా చేసుకుని అందరికి మళ్లీ షాక్ ఇచ్చింది. మొత్తానికి ఇక అంతా హ్యాపీనే అనుకుంటే.. సడెన్ గా మాకు విడాకులు మంజూరు అయ్యాయని అందరికీ మళ్లీ డబుల్ షాక్ ఇచ్చారు ఈ జంట. ఇక అప్పటినుండీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు ఈ సింగర్ అండ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 4, 2020 / 05:41 PM IST
    Follow us on


    సింగర్ నోయల్ హీరోయిన్ ఏస్తర్ తో ప్రేమలో ఉన్నానని ప్రకటించినప్పుడే అందరూ షాక్ గురయ్యారు. అసలు వీరిద్దరికీ ఎలా కుదిరింది ప్రేమా అని. ఆ తరువాత ఈ జంట పెళ్లి కూడా చేసుకుని అందరికి మళ్లీ షాక్ ఇచ్చింది. మొత్తానికి ఇక అంతా హ్యాపీనే అనుకుంటే.. సడెన్ గా మాకు విడాకులు మంజూరు అయ్యాయని అందరికీ మళ్లీ డబుల్ షాక్ ఇచ్చారు ఈ జంట. ఇక అప్పటినుండీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు ఈ సింగర్ అండ్ హీరోయిన్. అయినా ఎంతో గొప్పగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట ఎందుకు అంత తొందరగా విడిపోయారు.. అసలు పెళ్లి అయి ఏడాది కూడా కాకుండానే అప్పుడే అభిప్రాయ బేధాలు వీళ్ళ మధ్య ఎలా వచ్చాయి.. ఇలా అనేక రకాలుగా నెటిజన్లు తమ అనుమానాలను సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వీరినే అడిగేస్తున్నారు.

    Also Read: ఆ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు

    కానీ విడాకులకు కారణాలను మాత్రం ఈ జంట బయటపెట్టలేదు. అలాగే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు గానీ, విమర్శలు గాని చేసుకోలేదు. పద్ధతిగానే స్నేహపూర్వకంగానే విడిపోయారు.
    అయితే ఏస్తర్ మాత్రం నోయల్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా కాస్త అంటీముట్టనట్లుగానే ట్వీట్ చేసింది. ‘విడాకులు తీసుకోవాలనే నా ఈ నిర్ణయం వెనుక ఉన్న సున్నితమైన అంశాలను దయచేసి మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నా ఈ నిర్ణయానికి మీరు మద్దతు తెలువుతారని.. నాకు మీ సపోర్ట్ ఎప్పటిలానే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఎక్కడా నోయల్ గురించి పాజిటివ్ గా గాని, నెగిటివ్ గా గాని ఆమె ప్రస్తావించలేదు. నోయల్ మాత్రం ఏస్తర్ గురించి అంతా మంచిగానే ట్విట్టాడు. ఇంకా అలాగే ట్వీట్ చేసుకుంటూ పోతున్నాడు.

    Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

    మొదట ఏస్తర్ గురించి నోయల్ పూర్తి పాజిటివ్ గా ట్వీట్ చేస్తూ.. ‘ఏస్తర్ జీవితం ఎంతో బాగుండాలని, తను కన్న కలలు అన్ని నిజం కావాలని తానూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. దయచేసి ఈ విషయంపై ఎవ్వరూ బ్యాడ్ కామెంట్స్ చేసి బాధపెట్టొద్దని పనిలో పనిగా నెటిజన్లను కూడా నోయల్ వేడుకున్నాడు. ఇక అప్పటినుండి నోయల్ రోజూ ఏదో ఒకరకమైన పోస్ట్ పెడుతూనే వస్తున్నాడు. అయితే తాజాగా నోయల్ చేసిన ట్వీట్ ను చూస్తుంటే.. అతను ఎంతగా కుమిలిపోతున్నాడో అర్ధం అవుతుంది. నోయల్ బాధగా ట్వీట్ చేస్తూ.. ‘కోలుకోవాలి.. ముందుకు సాగుతూ ఉండాలి.. చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి.. ఎప్పడూ చీకట్లోనే కూర్చోలేము’ అంటూ హెవీ ఎమోషనల్ గా ఎంతో ఫీల్ అయిపోతూ నోయల్ ఈ ట్వీట్ చేసినట్టు అనిపిస్తోంది. ఏమైనా హీరోయిన్ తో విడాకులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.