దళితుడి శిరోముండనం కేసులో నటుడు, సినీ నిర్మాత నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని పెందూర్తిలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడి భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నూతన్ నాయుడిని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపర్చి త్వరలోనే విశాఖ పట్నంకు తీసుకురానున్నట్లు సీపీ మనీష్ కుమార్ తెలిపారు.
Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?
*శిరముండనంలో నూతన్ నాయుడి పాత్ర ఏంటీ?
విశాఖలో సంచలనం సృష్టించిన దళితుడి శిరోముండనం కేసుకు సినీ నిర్మాత నూతన్ నాయుడికి సంబంధం ఏంటీ? అసలు ఆరోజు ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్రం ఉందని తేల్చిన పోలీసులు అతడికోసం వెతికి తాజాగా అరెస్ట్ చేశారు.తన భార్య మధుప్రియను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్ చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. భార్యతోనూ మాట్లాడినట్టు గుర్తించారు. అందుకే తాజాగా అరెస్ట్ చేశారు.
ఈ కేసు పూర్వాపరాలు గమనిస్తే.. శిరోముండనం కేసులో బాధితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి నిర్మాత నూతన్ నాయుడి ఇంట్లో నాలుగు నెలలు పని చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ ఉన్నట్లుండి నిర్మాత ఇంట్లో పని మానేశాడు. ఈ నేపధ్యంలో నిర్మాత ఇంటి భద్రతాసిబ్బంది శ్రీకాంత్ ను ఇంటికి పిలిచి ఎందుకు పని మానేశావని ప్రశించినట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?
ఈ క్రమంలోనే గతంలో తమ ఇంటికి వచ్చిన ఓ బ్యూటీషన్ సెల్ ఫోన్ ను శ్రీకాంత్ హ్యక్ చేశాడని ఆరోపిస్తూ భద్రతా సిబ్బంది దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా ఓ క్షురకుడిని పిలిపించి అతడికి శిరోముండనం చేయించినట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన శిరోముండనం చేస్తున్న సమయంలో నూతన్ భార్య పక్కనే ఉన్నారని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఇప్పటికే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేసి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.