https://oktelugu.com/

బాబు మళ్లీ మూడు కళ్ల సిద్ధాంతం పాటించాల్సిందేనా..?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నన్ని రోజులు.. రాష్ట్రం ఏర్పడకుండా ఆంధ్రపాలకులు అడ్డుకున్నారు. అక్కడా ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు ఏపీలోనూ అదే వరుస నడుస్తోంది. అమరావతి రాజధాని ఉండాలని టీడీపీతో సహా మిగతా కొన్ని పక్షాలు ఉద్యమం నడిపిస్తున్నాయి. దీనికి కౌంటర్‌‌గా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమల నుంచి పోటీ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాల వెనుక సహజంగానే అధికారపార్టీ హస్తం ఉందనేది బహిరంగంగా వినిపిస్తున్న టార్గెట్‌. ఇప్పుడు ఈ ఉద్యమంతో విపక్ష నేతలకు తలపోటు మొదలైంది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 11:04 AM IST

    chandrababu

    Follow us on

    ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నన్ని రోజులు.. రాష్ట్రం ఏర్పడకుండా ఆంధ్రపాలకులు అడ్డుకున్నారు. అక్కడా ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు ఏపీలోనూ అదే వరుస నడుస్తోంది. అమరావతి రాజధాని ఉండాలని టీడీపీతో సహా మిగతా కొన్ని పక్షాలు ఉద్యమం నడిపిస్తున్నాయి. దీనికి కౌంటర్‌‌గా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమల నుంచి పోటీ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాల వెనుక సహజంగానే అధికారపార్టీ హస్తం ఉందనేది బహిరంగంగా వినిపిస్తున్న టార్గెట్‌. ఇప్పుడు ఈ ఉద్యమంతో విపక్ష నేతలకు తలపోటు మొదలైంది.

    Also Read: ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?

    టీడీపీ హయాంలో అమరావతిని రాజధాని చేయగా.. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక సీఎం జగన్‌ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని డిసైడ్‌ చేశారు. జగన్‌ నిర్ణయానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కూడా మద్దతుగా నిలిచారు. విశాఖలో రాజధానికి ఓకే అంటూనే అమరావతిలోని రైతులు నష్టపోకుండా చూడాలని స్టాండ్‌ తీసుకున్నారు.

    అయితే.. వాసుపల్లి డబుల్ స్టాండ్ గుంటూరు తమ్ముళ్లకు కోపం తెప్పించింది. మహానాడు వేదికగా కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ మాట్లాడిన వీడియో బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో గణేష్ దీనిపై స్థానిక ప్రజలకు సమాధానం చెప్పుకోవాలిసి వచ్చింది. ‘అది ఇప్పుడు మాట్లాడింది కాదని.. ఎప్పటిదో పాతదని.. కావాలనే కొందరు ఇలా చేశారని’ చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు ఈ విషయంలో జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోయింది. గణేష్ పరిస్థితినే ఇప్పుడు ఉత్తరాంధ్రలో తమ్ముళ్లు ఫేస్ చేస్తున్నారు. వీరిని ఎలా ఊరడించాలో కూడా టీడీపీ అధిష్టానానికి అర్థం కాకుండా ఉంది.

    Also Read: వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?

    విశాఖ రాజధానికి మద్దతునిస్తూ ఇప్పటికే చాలా మంది విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌‌ నేతలు వైసీపీ బాట పట్టారు. విశాఖను జగన్ రాజధాని చేసి అభివృద్ధి చేస్తారనే భరోసాను చంద్రబాబు ముందు పెట్టి పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఇకపై చంద్రబాబు మూడు కళ్ల సిద్ధాంతంతో సరికొత్త వ్యూహాన్ని తెలుగు తమ్ముళ్ల ముందు పెట్టకుంటే పార్టీ మరింత భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం రాజధాని అంశం కోర్టులో నడుస్తోందని.. విశాఖ రాజధానిగా క్లియరెన్స్‌ వస్తే ఇక టీడీపీ గ్రౌండ్‌ ఖాళీ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.