https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు అన్న కూతురును చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది… ఏ స్టార్ హీరోయిన్ కూడా పనికి రాదు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మనుగడను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : December 29, 2024 / 09:52 AM IST

    Ramesh babu Daughter Bharathi

    Follow us on

    Mahesh Babu :  సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనదైన మార్క్ చూపిస్తు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఆయన తర్వాత ఆయన కొడుకులు అయిన రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి వాళ్లు కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఆయన తర్వాత రమేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలు చేసినప్పటికి ఆయన పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోయాడు. కానీ మహేష్ బాబు మాత్రం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా స్టార్ హీరోగా వెలుగొందుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం అయన విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లడమే కాకుండా మహేష్ బాబు కూడా హాలీవుడ్ స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్ బాబు తన మేకోవర్ విషయంలో మొన్నటిదాకా చాలా కీలకమైన చర్చలు జరిపి ఎట్టకేలకు ఒక మేకోవర్ లో సెట్ అయిపోయాడు. రాజమౌళి ఈ సినిమాను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ రాజమౌళి తో సినిమా చేయడం అంటే కూడా అంత ఆషామాషి వ్యవహరమైతే కాదు.

    ఇక ఈ ఇద్దరికీ చాలా మంచి బాండింగ్ ఉండడంతో వీళ్ళ మధ్య వచ్చే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు జయ కృష్ణ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

    ఇక రమేష్ బాబు కూతురు అయిన భారతి పెద్దగా సోషల్ మీడియాలో కనిపించనప్పటికి అప్పుడప్పుడు సితారతో కలిసి కొన్ని రిల్స్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడడానికి చాలా అందంగా ఉన్న సితార ముందు హీరోయిన్స్ కూడా పని చేయరు అంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    నిజానికి ఈమె కూడా చాలా క్యూట్ గా ఉండడంతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుందా? అంటూ కొంతమంది కొన్ని కామెంట్లను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా కృష్ణ అందం వీళ్ళందరికి వచ్చిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…