https://oktelugu.com/

Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్లాప్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 29, 2024 / 09:34 AM IST

    Pushpa 2 Movie

    Follow us on

    Pushpa 2 Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసినప్పుడు పుష్ప 2 భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టే విధంగా ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న తర్వాత సినిమాల మీద కూడా చాలా మంచి ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనుకోకుండా పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన రేవతి అనే మహిళ మృతి కేసులో ఏ11 గా ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఇక అతన్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి హైకోర్టు నుంచి అతనికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇక తొందర్లోనే హైకోర్టు ముందు అతన్ని హాజరు పరిచే విధంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక దానికి సంబంధించినట్టుగానే ఈ కేసులో అసలు ముద్దాయి ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు వరుస సినిమాలు చేస్తు ఆయనకు పుష్ప 2 సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ కేసు విషయంలో ఆయన ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు అంటూ తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ముందుకు దూసుకెళుతున్న క్రమంలో ఈ మూవీ అంతట మంచి విజయం సాధించినప్పటికి రెండు రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అందులో ఒకటి తమిళనాడు కాగా, మరొకటి కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా కనెక్ట్ కాలేదు.

    కారణం ఏంటంటే సుకుమార్ నార్త్ ఆడియెన్స్ ను ఇంప్రెస్స్ చేసే విధంగా సినిమా తీశాడు కానీ తమిళ్ ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ సినిమాలో ఏమీ లేకపోవడం వల్ల వారు పెద్దగా దీనికి కనెక్ట్ కాలేకపోయారు…ఇక మల్లు అర్జున్ గా కేరళలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయనను సైతం కేరళ ప్రేక్షకులు రిజక్ట్ చేశారు.

    దానికి కారణం ఏంటి అంటే మలయాళం ఆర్టిస్ట్ అయినా ఫహాద్ ఫాజిల్ ను అంత పెద్దగా వాడుకోలేదు. ఆయన క్యారెక్టర్ కి సరైన ఇంపార్టెన్స్ లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ సినిమాను రిజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రెండు రాష్ట్రాలను మినహాయిస్తే ఈ సినిమా ఇండియాలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…