AUS VS IND Test Match : సామ్ కోన్ స్టాస్ చెప్పినట్టుగానే ఆడాడు. తొలి టెస్టులో అదరగొట్టాడు. 65 బంతుల్లో 60 పరుగులు తీశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు కొట్టి వారెవ్వా అనిపించాడు. అయితే అటువంటి ఆటగాడిని చూసుకొని ఆస్ట్రేలియా విర్రవీగింది. బుమ్రా ను గేలి చేసింది. అతడిని కచ్చితంగా ఎదుర్కొంటామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పుడేమో ఆ జట్టుకు అసలు సినిమా కనబడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 140 పరుగులు చేసి అదరగొట్టాడు. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు 114 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 82, వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో ఆకట్టుకున్నారు. కమిన్స్, బోలాండ్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
బుమ్రా అదరగొట్టాడు
మూడోరోజు తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేసి టీమ్ ఇండియాకు విశేషమైన బలాన్ని అందించిన నితీష్ కుమార్ రెడ్డి నాలుగో రోజు టీ విరామానికి ముందే అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే భారత ఇన్నింగ్స్ కొనసాగుతున్నప్పుడు.. వాషింగ్టన్ సుందర్ 50 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి బుమ్రా వచ్చాడు. అతడు కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొని అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బుమ్రాను రెచ్చగొట్టారు. తమ సైగలతో స్లెడ్జింగ్ చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న బుమ్రా నాలుగో రోజు రెచ్చిపోయాడు. ఈ కథనం రాసే సమయానికి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా యువ ఓపెనర్
సామ్ కోన్ స్టాస్ వికెట్ తీసిన విధానం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. 18 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక ఫోర్ సహాయంతో ఎనిమిది పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా స్కోర్ 20 పరుల వద్ద ఉన్నప్పుడు ఆరో ఓవర్ బుమ్రా వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కళ్ళు చెదిరే విధంగా వేయడంతో.. సామ్ కోన్ స్టాస్ దానిని అంచనా వేయలేకపోయాడు. అది వెంటనే బాణం లాగా దూసుకు వచ్చి వికెట్లను పడగొట్టింది.. దీంతో సామ్ కోన్ స్టాస్ కు గర్వభంగం కలిగింది. సామ్ కోన్ స్టాస్ వికెట్ పడిపోవడమే ఆలస్యం కోహ్లీ ఆనందంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఉద్దేశించి చేతులు పైకి లేపాడు. అయితే ఇదే ఊపులో మిగతా టాప్ -3 వికెట్లను కూడా బుమ్రా పడగొట్టాడు.
MIDDLE STUMP! Jasprit Bumrah gets Sam Konstas with a pearler. #AUSvIND | #DeliveredWithSpeed | @NBN_Australia pic.twitter.com/A1BzrcHJB8
— cricket.com.au (@cricketcomau) December 29, 2024