Allu Arjun : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇండియా మొత్తంలో ఆయన క్రేజ్ అనేది విపరీతంగా విస్తరించిందనే చెప్పాలి. పుష్ప సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మాత్రం భారీ రికార్డులను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడు రోజుల్లో దాదాపు 550 కోట్లకు పైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా విపరీతమైన కలెక్షన్లు రాబట్టి ప్రస్తుతం టాప్ లో ఉన్న సినిమాల రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి వస్తున్న క్రేజ్ ను బట్టి చూస్తుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా పెను ప్రభంజనాలు సృష్టించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిని దాటేసి అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజిషన్ కోసం ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన ముందు ఏ హీరో కూడా నిలబడలేకపోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఆయన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా చాలా గొప్ప సన్నివేశాల్లో నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆయన కష్టం వల్లే తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తూ ఉండటం గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఐకాన్ స్టార్ గా ఆయనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరి ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉన్నారా? మరి ఆయనకు పోటీ ఇస్తూ వాళ్లు కూడా ముందుకు వస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…