Pawan kalyan : పవన్ కళ్యాణ్ ని విపరీతంగా వాడడంలో ఈ కుర్ర హీరో తర్వాతే ఎవరైనా..

మొత్తానికి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ని తెగ వాడేయడం లో ఈ హీరో తరువాతే ఎవరైనా అని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Written By: NARESH, Updated On : August 27, 2023 5:08 pm

pawan kalyan thammudu

Follow us on

పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఆ పేరులోనే అంత పవర్ ఉంది. సినీ ప్రేక్షకులకే కాదు సినిమాలో నటించే వారికి కూడా ఈయన అంటే విపరీతమైన అభిమానం. కొంతమంది సెలబ్రిటీలు ఈయనని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పి.. వారి సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వాడి సూపర్ హిట్ లు సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ వేరే హీరోలకి కూడా అలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోల్లో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు నితిన్. స్టేజి పైనే కాదు సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఎక్కువగా వాడుతారు ఈ హీరో.

ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ని తన సినిమా టైటిల్ గా పెట్టుకొని సూపర్ హిట్ అందుకున్నారు. ఇక అంతే కాదు ఆ సినిమా లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ‘తొలిప్రేమ’లో ‘ఏమైందో ఈ వేళ’ పాటను రీమిక్స్ చేశారు. బయట కొన్ని ఈవెంట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పాటలకు డాన్స్ వేసి ఆయన అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు. కొన్ని నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రిఫరెన్స్ సీన్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి.

అయితే ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో మరలా తప్పకుండా ఒక సూపర్ హిట్ అందుకోవాలి అనుకున్నారో ఏమో.. మళ్లీ పవన్ కళ్యాణ్ ని వాడటం మొదలు పెట్టేసారు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా నితిన్ మరో కొత్త సినిమా ఓకే చేశాడు. ఈ సినిమాకి ఏకంగా పవన్ కళ్యాణ్ పాత సినిమా టైటిల్ ని తెచ్చి పెట్టేసుకోవడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘తమ్ముడు’ అని పెట్టడం విశేషం. నిన్న ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ గా ఉండే డైరెక్టర్లతో నితిన్ సినిమాలు చేస్తూ ఉంటారు అని కూడా ఒక టాక్ ఉంది. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మళ్ళీ ఇప్పుడు వేణు శ్రీరామ్ తో చేసి ఆ మాటలు నిజమే ఏమో అనిపించుకుంటున్నారు ఈ హీరో. మొత్తానికి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ని తెగ వాడేయడం లో ఈ హీరో తరువాతే ఎవరైనా అని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.