Guntur Kaaram movie : గుంటూరు కారం సినిమాకి ఆ పని మాత్రం చేయొద్దు అంటున్నా మహేష్ బాబు…

ఇక మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయో, ఈ చిత్రం టిజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలి

Written By: NARESH, Updated On : August 27, 2023 6:20 pm

Guntur Karam Movie

Follow us on

Guntur Kaaram movie : అతడు, ఖలేజా లాంటి మంచి సినిమాల తరువాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా నుంచి ఒక చిన్న వీడియో గ్లింప్, మరో పోస్టర్ తప్ప ఏ అప్డేట్ ఇంతవరకు రాలేదు.

ముఖ్యంగా ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేస్తారని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అదేమీ చేయకుండా కేవలం గుంటూరు కారం సినిమాలోని మహేష్‌ బాబు మాస్ లుక్ వదులుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యూనిట్ సభ్యులు.

శ్రీమంతుడు, మహర్షి లాంటి క్లాస్‌ సినిమాలు చేసిన తర్వాత మహేష్ చేస్తున్న పక్కా మాస్ మూవీ ఇది. ఇందులో మహేష్‌ గెటప్‌ క్లాస్‌గా కనిపించినప్పటికి డైలాగ్‌లు, నటన ఊర మాస్‌గా డిజైన్ చేస్తున్నారు డైరెక్టర్ తివిక్రమ్‌ శ్రీనివాస్. దాంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరగాలి అంటే సినిమాకి తప్పకుండా మంచిగా ప్రమోషన్స్ చేయాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాకి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టకండి అని తెలియజేసినట్టు తెలుస్తోంది.

స్టార్ హీరోల సినిమాకి కొంచెం ఎర్లీ గానే ప్రమోషన్లు మొదలవుతాయి. కానీ గుంటూరు కారం చిత్రానికి అలా చేయొద్దని తెలియజేశారట మహేష్. వినాయక చవితి రోజు సినిమా యూనిట్ టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభిద్దాము అని అనుకున్నారట. కానీ మహేష్ బాబు నిర్ణయం తరువాత వినాయక చవితి రోజు కేవలం ఒక లిరికల్ పాటని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారట.

మరి మహేష్ బాబు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనే సందేహాలు ఉన్నాయి. కొంతమంది మాత్రం సినిమా పైన మరి ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా.. కామ్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని మహేష్ బాబు అనుకుంటున్నట్టు అంటున్నారు. మరి కొంతమంది ఏమో సినిమా రిలీజ్ డేట్ ఆలస్యం కావడంతో మహేష్ చిన్నగా ప్రమోషన్స్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు వద్దు ఆనుందచని అభిప్రాయపడుతున్నారు.

ఇక మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయో, ఈ చిత్రం టిజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.