Site icon OkTelugu

Vizianagaram: చచ్చిపో లేకుంటే ప్రేమ విషయం బయట పెడతా..!

Vizianagaram

Vizianagaram

Vizianagaram: నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఒకరి మరణాలకు ఇంకొకరు కారణమవుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా భర్తను భార్య, భార్యను భర్త అంతమొదిస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. కొందరు మృగాళ్లు మహిళలను మోసం చేసి చనిపోయేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో జరిగింది. గరివిడి మండలం, తొండంగ్రి గ్రామానికి చెందిన అవివాహిత అఖిల ప్రేమించిన వ్యక్తి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఏం జరిగిందంటే..
అఖిల గ్రామానికి చెందిన యువకుడు రాము నాయుడుతో స్నేహం పెంచుకుంది. క్రమంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అఖిలను పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో అఖిల కూడా మరో యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులు కూడా మరో యువకుడిని చూశారు. పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న రాము నాయుడు నిశ్చితార్థం చేసుకుంటే మన ప్రేమ విషయం బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. నన్ను ప్రేమించి మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన అఖిల ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగింది. చనిపో అని సూచించాడు. చనిపోకపోతే మన విషయాన్ని బయటకు చెబుతా అని బెదిరించాడు.

పురుగుల మందు తాగి..
భయంతో అఖిల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరికి ఒకరోజు రాము చెప్పినట్టుగా పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి చేర్పించగా తీసుకున్న మందు మోతాదు ఎక్కువగా ఉండడంతో చికిత్స పొందుతూ మరణించింది.

పోలీసుల యాక్షన్‌..
కుటుంబ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. మొదటి దశలో కేసులో బెదిరింపు, మానసిక హింస, ఆత్మహత్యకు ప్రేరేపణగా కేసు నమోదు చేశారు. ఆసుపత్రి మెడికల్‌ రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికలు, ఫోన్‌ కాల్‌ రికార్డులు, నిశ్చితార్థానికి సంబంధించిన మెసేజ్‌లు సేకరించేందుకు పోలీసులు ఆదేశించారు. రామువారి కుటుంబ, కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు తీసుకోబడుతున్నాయి. స్థానికుల నుంచి పొందిన సమాచారానికి అనుగుణంగా టౌన్‌లోని సీసీ టీవీ ఫుటేజీలు, రాముతో అఖిల విషయానికి సంబంధించిన సామాజిక పరిచయాలను సృష్టించిన వ్యక్తుల మాటలు పరిశీలిస్తున్నారు.

Exit mobile version