Nithya Menen: కేరళ కుట్టి నిత్యా మీనన్ మంచి నటి. అద్భుతంగా నటించగలదు. కానీ అవకాశాలే ఎక్కువ రావు. వచ్చినా చిన్నాచితకా సినిమాలే. అందుకే, నిత్యా మీనన్ మనసు ఇక పెళ్లి వైపుకు వెళ్ళిందట. ఎలాగూ సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. దీనికితోడు నిర్మాతగా మారింది. అలాగే త్వరలో పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఇప్పటికే నిత్యా పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెబుతున్నాయి తమిళ మీడియా వర్గాలు. వాటికి బలం చేకూర్చేలా నిత్యా కూడా ప్రవర్తిస్తోంది. నిజానికి ఒక యంగ్ హీరోతో నిత్యా చాన్నాళ్లు డేటింగ్ చేసింది. నిత్యా కూడా ఈ విషయాన్నీ ఆ మధ్య ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఆ యంగ్ హీరో ఆల్ రెడీ పెళ్లి చేసుకున్నాడు.
అందుకే నిత్యా మీనన్ కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తోందట. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా కొనసాగాలని నిత్యా మీనన్ ప్లాన్ చేసుకుంది.
కానీ ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు నిత్యా రెడీ అయిందట.
Also Read: Rebel Star: ‘రెబల్ స్టార్’ను చూసి భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..!
చెన్నైలోని ఓ వ్యాపారవేత్తతో నిత్యాకి పెళ్లి ఫిక్స్ అయిందట. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. అన్నట్టు నిత్యా నిర్మించిన ‘స్కైలాబ్’ సినిమా డిజాస్టర్ అయింది. ఈ నెల 4న రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి నిత్య మీనన్ నిర్మాత. నిత్య మీనన్ నిర్మాతగా కూడా ఫెయిల్ అయింది.
Also Read: Pushpa: వర్కింగ్డే లోనూ ‘తగ్గేదె లే’ అంటున్న పుష్ప.. డే4 కలెక్షన్ ఎంతో తెలుసా?