Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు తాను రాసిన నీతి గ్రంథంలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఒక మనిషి జీవితంలో ఎదుగుదల పొందాలంటే తప్పనిసరిగా కొన్ని పద్ధతులను అవలంభించాలని ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే నూతన సంవత్సరంలో మనం అనుకున్న విజయాలను సాధించాలన్నా.. జీవితంలో గెలుపు చూడాలన్న తప్పనిసరిగా పాటించాల్సిందే..
సమయపాలన: ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని లేకపోతే తను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ముందుగా అతనికి సమయపాలన తెలిసి ఉండాలి. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా ఆ ఒక్క క్షణాన్ని తమ విజయం కోసం ఉపయోగించుకునే వారే జీవితంలో గెలుపు సాధిస్తారు. అందుకే ఎలాంటి విజయాలను అందుకోవాలన్న సమయపాలన చేయకూడదని చాణిక్యుడు తెలిపాడు.
Also Read: జీవితంలో గెలవాలంటే యవ్వనంలో వీటిని అలవర్చుకోవాలి ?
విమర్శలు వద్దు: మనం ఒక విజయాన్ని అందుకోవాలంటే మన జీవితంలో విమర్శలకు చోటు ఇవ్వకూడదు. విమర్శలను వినడం వల్ల మనలో మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇలాంటి విమర్శలను వినడం వల్ల మన మనసు ఒకచోట నిశ్చలంగా ఉండదు. ఈ క్రమంలోనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతాము.
డబ్బు ఆదా చేయడం: ఒక మనిషి జీవితంలో గెలుపు పొందాలంటే స్వయంకృషి, ఆత్మ విశ్వాసం పట్టుదల ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం.మనం అనవసరంగా డబ్బులు వృధా చేస్తే అవసరమైనప్పుడు మనకు డబ్బు చేతికి అందదు. ఇలాంటి సమయంలో మనకు సహాయం చేయడానికి ఎవరూ రారు కనుక డబ్బులు ఆదా చేయడం నేర్చుకోవాలని చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా తెలిపారు.
Also Read: మీ ఇంటికి సిరిసంపదలు కలగాలంటే ఈ మాలతో లక్ష్మీదేవిని పూజించాలి?