CM Jagan: ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో హమీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదు. జగన్ నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తానని ఎన్నికల హామీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్బులు మొత్తం వాటికే ఖర్చు చేస్తున్నారు. దీంతో అభివృద్ధికి నిధులు లేకుండా పోయాయి. కేంద్రం అందించే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలంటే చాలా కష్టం. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కానీ అభివృద్ధి మాత్రం బూతద్దంలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. కేంద్రం వేస్తున్న రోడ్లు తప్పా వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం రోడ్లు కూడా వేయలేదని ప్రజలే ఆరోపిస్తున్నారు.
ఆర్థికంపై నో క్లారిటీ…
జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా రాబడి తగ్గిపోయేలా మద్యం షాపులను మూసి వేయించారు. ప్రస్తుతం ఏపీ ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా అప్పు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని దిక్కులేదు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళంలో పడవేశారు.దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. దీంతో పన్నుల రూపంలోనూ రాష్ట్ర ఖజానాకు జగన్ గండికొడుతున్నారు.
శిలాఫలాకాలపై పరిమితం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. నిధులు లేకపోవడంతో అది కాస్త అక్కడే ఆగిపోయింది. మచిలీ పట్నం, రామాయం పోర్టు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. పోలవరం ప్రాజెక్టుకు మాత్రం కేంద్రం నుంచి నిధులు వస్తుండటంతో అది 2024 ఎన్నికల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. మరి మిగతా వాటిని జగన్ ఎలా పూర్తి చేయనున్నారు. ప్రజలను ఎలా మెప్పించనున్నారని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read: YCP Internal Fight: అన్ని పార్టీల్లా కాదు వైసీపీ.. ఇక్కడ నోరెత్తితే అంతే సంగతులు..!
ఇవే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా జగన్ పార్లమెంటు నియోజకవర్గాలను 26 జిల్లాలుగా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, అది జన గణన పూర్తయ్యాకే పాసిబుల్ అని కేంద్రం చెప్పడంతో అది కూడా అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేకహోదా అంశాలతో పాటు అభివృద్ధి ఎంతో కొంత చేసి చూపించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రజావ్యతిరేకతకు గురవ్వక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: MLA Roja: ఎమ్మెల్యే రోజా చేసిన ఈ గొప్ప పనికి చప్పట్లు కొట్టకుండా ఉండలేరు..