https://oktelugu.com/

కరోనా దెబ్బకు బయపడ్డ నితిన్…

‘భీష్మ’  విజయంతో మంచి ఆనందంలో ఉన్నాడు యంగ్‌ హీరో నితిన్. షాలిని, నితిన్ ల వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనుంది. అయితే నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ వివాహం ఆగడానికి కారణం కరోనా వైరస్, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 15, 2020 / 02:21 PM IST
    Follow us on

    ‘భీష్మ’  విజయంతో మంచి ఆనందంలో ఉన్నాడు యంగ్‌ హీరో నితిన్. షాలిని, నితిన్ ల వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనుంది. అయితే నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ వివాహం ఆగడానికి కారణం కరోనా వైరస్, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.

    ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు కాగా, వచ్చే నెల 15న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, ఆపై 16న రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకున్నారు.అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వివాహం చేసుకోవాలని కొందరు బంధుమిత్రులు సలహా ఇస్తున్నట్టు సమాచారం. ఈ వివాహం వాయిదాపై అధికారిక ప్రకటన రావల్సివుంది.