Hero Nithin : ఒకప్పుడు హీరో నితిన్(Hero Nithin) సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఓపెనింగ్ ఉండేది, మినిమమ్ గ్యారంటీ ఫుల్ రన్ కలెక్షన్స్ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్ కి తగ్గట్టుగా ఆయన అప్డేట్ అవ్వకపోవడంతో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. ‘భీష్మ’ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ దురదృష్టం కొద్దీ కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు వారాల లోపే థియేటర్స్ ని మోడీ వేయడం తో భీష్మ రన్ ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన చెక్ చిత్రం డిజాస్టర్ కాగా, ‘రంగ్ దే’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత ‘మాచెర్ల నియోజకవర్గం’ మూవీ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, కమర్షియల్ గా ఇది కూడా పెద్ద డిజాస్టర్ గానే నిల్చింది. ఈ సినిమా వరకు ఓపెనింగ్స్ విషయం లో నితిన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..ఈసారి మిస్ అయ్యే ప్రసక్తే లేదు!
ప్రతీ సినిమాకు మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేవాడు. కానీ ఆయన రీసెంట్ చిత్రం ‘రాబిన్ హుడ్’, ఈ చిత్రానికి ముందు విడుదలైన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ లకు కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. ‘రాబిన్ హుడ్’ అయితే నితిన్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో భీష్మ మొదటి రోజుకు వచ్చినంత వసూళ్లు కూడా రాలేదు. ఇలా వరుసగా 5 ఫ్లాప్స్ పడడంతో నితిన్ కెరీర్ రిస్క్ లో పడింది. ఇప్పుడు కచ్చితంగా ఆయనకు సూపర్ హిట్ పడాల్సిందే. లేకపోతే ‘ఇష్క్’ ముందు రోజులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) తో ‘తమ్ముడు'(Thammudu Movie) అనే చిత్రం చేసాడు. దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.
వేణు శ్రీరామ్ ఇప్పటి వరకు ఫ్లాప్ సినిమా చేయలేదు. ఆయన తీసిన చిత్రాలన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినవే. ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ చిత్రం ఆయనకు గొప్ప పేరు ని తీసుకొచ్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం మినిమమ్ గ్యారంటీ రేంజ్ లో ఉంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు నితిన్ ఫ్యాన్స్. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 4 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం లో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె గతంలో ‘కాంతారా’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. దేశవ్యాప్తంగా ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇది కూడా నితిన్ కి బాగా కలిసొచ్చే అంశం. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా నితిన్ కి భారీ కం బ్యాక్ చిత్రంగా నిలుస్తుందో లేదో చూడాలి.