Nithin: ఈమధ్య కాలం లో యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ప్రతీ సినిమా ఎలా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘భీష్మ’ చిత్రం తర్వాత ఈ హీరో చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ పరిస్థితి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేవి. కానీ ఈ చిత్రం మాత్రం ఓపెనింగ్స్ కి నోచుకోలేదు. ఎంతలా అంటే ఒకప్పుడు నితిన్ సినిమాకు వచ్చే మొదటి రోజు వసూళ్లు, ఈ చిత్రానికి క్లోజింగ్ లో కూడా రాలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కెరీర్ కి డేంజర్ బెల్స్ మోగాయి. ఇక నుండి ప్రమత్తతంగా లేకపోతే కెరీర్ క్లోజ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది.
Also Read: బాలయ్య బోయపాటి లకు ఏమైంది..? ఎడమొఖం పెదమొఖం గా ఉంటున్నారా..?
అందుకే పాపం నితిన్ ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం పైనే పెట్టుకున్నాడు. ‘వకీల్ సాబ్’ వంటి భారీ హిట్ తర్వాత సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో హీరోయిన్ గా కాంతారా ఫేమ్ సప్తమి గౌడా నటించింది. అదే వర్ష బొల్లమ్మ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక సీనియర్ హీరోయిన్ లయ కూడా ఇందులో ఒక పవర్ క్యారక్టర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నితిన్ ఈమెకు తమ్ముడిగా నటిస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం లో నటిస్తున్న నటీనటుల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ నిన్న మేకర్స్ ఒక వీడియో ని విడుదల చేశారు. అందులో నితిన్ గెటప్ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఇదేదో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అనుకుంటే, నితిన్ ఇందులో యారో షూటర్ గా కనిపించాడు. అంటే ఆయన తన ఊరి తరుపున ఒలంపిక్స్ గేమ్స్ ఆడి మంచి పేరుని తీసుకొచ్చే కుర్రాడి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
యారో షూటింగ్ లో గ్లోడ్ మెడల్ సాధించిన ఒక యువకుడు, తన అక్క కి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కోసం ఆమె ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగే పరిణామాలను తీసుకొని ఈ చిత్ర కథ అల్లి ఉంటారని విశ్లేషకులు ఈ వీడియో ని చూసి అంచనా వేస్తున్నారు. మరి కథ నిజంగా అదే అయితే ఈసారి నితిన్ కచ్చితంగా సూపర్ హిట్ ని అందుకోబోతున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ వేణు శ్రీరామ్ మంచి పనితనం తెలిసిన డైరెక్టర్. పింక్ లాంటి కోర్ట్ డ్రామా ని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో చేసి హిట్ కొట్టాడంటేనే అర్థం చేసుకోవచ్చు వేణు శ్రీరామ్ పనితనం ఎలాంటిదో. కాబట్టి ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ గా తీసి ఉంటాడని అంటున్నారు విశ్లేషకులు