Nithiin: సినీ ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం, అవి హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం వంటివి జరగడం కొత్తేమి కాదు. చిన్న హీరోల దగ్గర నుండి, పెద్ద హీరోల వరకు ఇవి మామూలే. అలా హీరో నితిన్ కూడా కెరీర్ లో వేరే లెవెల్ కి చేరుకునే సినిమాలను వదిలి టాప్ స్టార్స్ లీగ్ లోకి వెళ్లే అరుదైన అదృష్టాన్ని వదులుకున్నాడు. మధ్యలో ఆయన వరుసగా 12 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను చేసి మార్కెట్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ‘ఇష్క్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ వచ్చాయి, మధ్యలో ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఫ్లాప్స్ లోనే ఉన్నాడు. అయితే నితిన్ కి కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్స్ పడినా, అవి కంటెంట్ పరంగా మాత్రమే పేరుని తెచ్చుకున్నాయి కానీ, నితిన్ పోషించిన పాత్రలకు మాత్రం కాదు.
అందుకే ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినా మీడియం రేంజ్ హీరోగానే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా అప్పట్లో నితిన్ ఒక అదిరిపోయే స్టోరీ ని కొన్ని అనుకోని కారణాల వల్ల చేయలేకపోవడం, అదే స్టోరీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి, స్టార్ హీరో అవ్వడం వంటివి జరిగాయి. ఇంతకీ నితిన్ వదులుకున్న సినిమా మరేదో కాదు, ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్కడు’ చిత్రం అప్పట్లో ఒక ప్రభంజనం. అప్పటి వరకు మామూలు హీరోగా ఇండస్ట్రీ లో కొనసాగిన మహేష్ బాబు, ఈ చిత్రంతో స్టార్ హీరో గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అయితే ఈ చిత్రాన్ని నిర్మాత ఏం ఎస్ రాజు ముందుగా నితిన్ తో చేయాలనీ అనుకున్నాడట. ఈ స్టోరీ ని వినిపించగానే నితిన్ ఎంతో ఆనందపడ్డాడు. నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా కథతో వచ్చారు అని కృతఙ్ఞతలు కూడా తెలియచేసాడట. కానీ అప్పటికే ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న సై చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చేస్తూ, ఒక్కడు కి కూడా పని చేస్తానని చెప్పాడట నితిన్. అయితే రాజమౌళి అనుమతి కోరగా, అందుకు ఆయన నిరాకరించాడట. రాజమౌళి సినిమాలో హీరో అంటే మన అందరికీ తెలిసిందే. తన చిత్రం పూర్తి అయ్యేవరకు, మరో సినిమాలో నటించకూడదు. ఇది కేవలం ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా అలాంటి రూల్స్ పాటించేవాడట రాజమౌళి. ఆ కారణం చేత ఈ సినిమా నితిన్ చేతుల్లో నుండి మహేష్ బాబు చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత హిస్టరీ మనకి తెలిసిందే.