AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గానే థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలందరూ థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏషియన్ సునీల్ ఈ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ముందుగా మహేష్ బాబు తో ‘AMB సినిమాస్’ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు . అది పెద్ద హిట్ అవ్వడం తో అల్లు అర్జున్ తో కలిసి అమీర్ పేట్ లో ‘AAA సినిమాస్’ మొదలు పెట్టాడు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్ లోని కోకాపేట లో మరో ‘AAA సినిమాస్’ ని ప్రారంభించారు. డాళ్బీ స్క్రీన్ తో మొదలెట్టిన ఈ మల్టీప్లెక్స్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఆయన వైజాగ్ జనాలకు కూడా ‘AAA సినిమాస్’ తో అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించడానికి రెడీ అయ్యాడు. గత కొంత కాలంగా వైజాగ్ లో నిర్మిస్తున్న ‘AAA సినిమాస్’ పూర్తి అయ్యింది. నేడు అల్లు అర్జున్ గ్రాండ్ గా ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ థియేటర్ లో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ తో పాటు , ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ‘పుష్ప’ చిత్రం లో ‘తగ్గేదేలే ‘ మ్యానరిజం తో ఉన్నటువంటి ఈ విగ్రహం పక్కనే, అల్లు అర్జున్ స్టైల్ గా ‘తగ్గేదేలే ‘ అంటూ మ్యానరిజం చేశాడు . ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ ‘AAA సినిమాస్’ స్పెషాలిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా 8 స్క్రీన్స్ ఉంటాయి. ప్రీమియర్ కంఫర్ట్ , రిక్లైనర్ సీట్స్ తో కలిపి మొత్తం మీద 1556 సీట్స్ ఉంటాయి. ఈ స్క్రీన్స్ లో ‘హై ఎండ్ 4K లేజర్ ప్రొజెక్టర్స్’ ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డాళ్బీ అట్మాస్ సౌండ్ సిస్టం ని కూడా అమర్చారు. ఇక ప్రైవేట్ ఫంక్షన్స్ కోసం ‘ ది 8 స్క్వేర్ లాంజ్’ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పుట్టినరోజు వేడుకలు , సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ థియేటర్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలను రేపటి నుండే ఈ థియేటర్ లో చూడొచ్చు.