Nikhil ‘Spy’ overseas premiere show talk : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్పై’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయి లో ప్రారంభం అయ్యింది. ఈ షో నుండి వచ్చిన టాక్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం.
సినిమా ప్రారంభం చాలా స్లో గానే అవుతుందట, ఆ తర్వాత ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటూ ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ అనుభూతి ఇస్తుందట. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం సాగిపోతుంది, సెకండ్ హాఫ్ బలంగా ఉండే విధంగా ఇంటర్వెల్ ని డిజైన్ చేసారు. సెకండ్ హాఫ్ ప్రారంభం కాస్త గ్రిప్పింగ్ గానే ఉంటుంది, కానీ నెమ్మదిగా స్లో అవుతూ వెళ్తుంది. అలా సెకండ్ హాఫ్ గ్రిప్ మొత్తం పోతుందట. హీరోకి నిఖిల్ సిద్దార్థ్ సినిమా మొత్తాన్ని తన భుజస్కందములపై మోసినట్టు అనిపిస్తుందట.
మధ్యలో రానా దగ్గుపాటి ఎంట్రీ ఈ చిత్రానికి కాస్త బూస్ట్ ని ఇచ్చింది. అలా ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సినిమాలేవీ లేకపోవడం వల్ల ఈ చిత్రం లాంగ్ వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టొచ్చు కానీ, అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేవు. ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్ కొన్ని కొన్ని సార్లు మన ఇండియా లో వచ్చిన టాక్ తో పోలిస్తే పూర్తిగా బిన్నంగా ఉంటుంది.
ఈ సినిమాకి కూడా అలా ఉంటుందో లేదో చూడాలి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. రేపు బక్రీద్ కాబట్టి వసూళ్లు బాగానే ఉంటాయి, కానీ ఎల్లుండి నుండి సినిమా నిలబడుతుందో లేదో చూడాలి. నిఖిల్ ఈ చిత్రం నిర్మాతతో ఔట్పుట్ బాగా రాలేదు అని గొడవపడిన విషయం బయటకి వచ్చేసరికి అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత దారుణంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.