Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్ నిల్చిన సంగతి తెలిసిందే. అత్యధిక శాతం మంది గౌతమ్ విన్ అవుతాడని అనుకున్నారు, ఫినాలే రోజు వచ్చిన పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గౌతమే గెలుస్తాడని చెప్పారు. ఆ రేంజ్ వేవ్ ఉన్నప్పటికీ కూడా నిఖిల్ గెలవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే నిఖిల్ కూడా ముమ్మాటికీ టైటిల్ గెలిచేందుకు అర్హుడే. కానీ చాలా మంది నిఖిల్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మాస్క్ వేసుకున్నాడు, చాలా సేఫ్ ప్లేయర్ అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాజీ ప్రేయసి కావ్య అనేక సందర్భాల్లో నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, ఇప్పుడు మనకి కనిపించే నిఖిల్ నిజం కాదు, ఆయనలోని పూర్తి యాంగిల్స్ ని బయటకి తియ్యాలి అంటూ ఒక ఈవెంట్ లో ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పుకొచ్చింది.
ఇదంతా పక్కన బిగ్ బాస్ సీజన్ మరో మూడు వారాల్లో ముగుస్తుంది అనగా, నిఖిల్ శనివారం ఎపిసోడ్ రోజున తనకి కావ్య అంటే ఇంకా ఇష్టం ఉందని, టైటిల్ గెలిచిన తర్వాత కప్పుతో ఆమె ముందు ఉంటానని, కచ్చితంగా ఆమె నన్ను తిడుతుంది, ఆ విషయం తెలుసు, అయినప్పటికీ భరిస్తానని, మళ్ళీ తనతో ప్యాచప్ చేసుకుంటాను అంటూ ఎమోషనల్ గా చెప్తాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అదే చేస్తాడని ఆయన అభిమానులు కూడా అనుకున్నారు. కానీ బజ్ ఇంటర్వ్యూ లో అర్జున్ ఈ ప్రస్తావన తీసుకొచ్చి, ఇప్పుడు వెళ్తావా కావ్య దగ్గరకి అని అడగగా, దానికి నిఖిల్ సమాధానం చెప్తూ ‘వెళ్తాను..కానీ కాస్త ధైర్యం తెచ్చుకోవాలి’ అని అంటాడు. కప్పుతోనే వెళ్తావా అని నిఖిల్ ని అర్జున్ అడగగా, కప్పుతో ఎందుకులే, కప్పు ఇంట్లో పెట్టి వెళ్తాను అని అంటాడు.
నిఖిల్ చెప్పిన సమాధానం తీరుని చూస్తే, వెళ్ళొచ్చులే, కొంపలు ఏమి అంటుకోలేదు అప్పుడే అన్నట్టుగా అనిపించింది. హౌస్ లో ఉన్నంత కాలం నిఖిల్ ని తన కన్నడ బ్యాచ్ తోనే ఉంటున్నాడు, వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. కానీ బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ ప్రవర్తిస్తున్న తీరుని చూస్తే, నిజంగానే ఆయన కన్నడ బ్యాచ్ తో ఉద్దేశపూర్వకంగా స్నేహం చేశాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈయన బయటకి వచ్చిన తర్వాత తనని గెలిపించిన తెలుగు ఫ్యాన్స్ కి చిన్న థాంక్యూ మీట్ కూడా పెట్టలేదు. కప్పు తీసుకొని నేరుగా తన సొంత ఊరైన మైసూరికి వెళ్ళిపోయాడు. మరోపక్క రన్నర్ గా నిల్చిన గౌతమ్ ఫ్యాన్స్ మీట్ పెట్టి, తనని నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన అభిమానులకు కృతఙ్ఞతలు తెలిచేసాడు. కానీ నిఖిల్ మాత్రం ఆ పని చెయ్యలేదు. చేస్తాడనే సూచనలు కూడా ఆయన ఇవ్వలేదు.
