https://oktelugu.com/

సుడిగాలి సుధీర్ విషయంలో నిర్మాతల టెన్షన్ !

జబర్దస్త్ నుండి వచ్చిన మంచి కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అందులోనూ రష్మీ, సుధీర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి.. ఇక వారిద్దరి పై చేసే స్కిట్స్ అండ్ జోక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు బుల్లితెర పై ఈ జంటకు ఉన్న క్రేజే వేరు. షో ఏదైనా.. ఈ జంట ఉన్నారు అంటే చాలు.. ఇక ఆ షో సూపర్ హిట్ అయినట్టే అనే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించారు […]

Written By:
  • admin
  • , Updated On : October 21, 2020 / 05:52 PM IST
    Follow us on


    జబర్దస్త్ నుండి వచ్చిన మంచి కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అందులోనూ రష్మీ, సుధీర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి.. ఇక వారిద్దరి పై చేసే స్కిట్స్ అండ్ జోక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు బుల్లితెర పై ఈ జంటకు ఉన్న క్రేజే వేరు. షో ఏదైనా.. ఈ జంట ఉన్నారు అంటే చాలు.. ఇక ఆ షో సూపర్ హిట్ అయినట్టే అనే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించారు వీరు. నిజానికి సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు అన్నా.. దానికి కారణం కూడా అతనికి ఉన్న లవర్ బాయ్ క్రేజే. అందుకే జబర్దస్త్ నిర్మాతలు కూడా సుదీర్ కి కాస్త ఎక్కువే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. పైగా జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాటు ఢీ షోలో కూడా సుడిగాలి సుధీర్ ను కీలకంగా వాడుకుంటున్నారు.

    Also Read: ‘తుగ్లక్ దర్బార్’కు టాలెంటెడ్ బ్యూటీ దూరం !

    అయితే తాజాగా సుధీర్ కు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. కరోనా లక్షణాలు బయటపడటంతో సుదీర్ కరోనా టెస్ట్ చేయించుకున్నాడని.. కాగా కరోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 18న సుధీర్ కు కరోనా పాజిటివ్ గా తేలిందని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని.. దాంతో సుదీర్ ను నమ్ముకుని ప్లాన్ చేసుకున్న షోలన్నీ కాస్త టెన్షన్ లో పడ్డాయి అని తెలుస్తోంది. అయితే.. తనకు కరోనా సోకిందనే విషయం మాత్రం సుధీర్ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ లోని హైలైట్స్ !

    మరి ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం సుధీర్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ సుధీర్ కి అభిమానులు ఉన్నారో లేదో గాని, సోషల్ మీడియాలో మాత్రం సుదీర్ తొందరగా కరోనా మహమ్మారిని జయించాలని కోరుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అసలు ఒకవేళ నిజంగానే సుధీర్ కు కరోనా వచ్చిందనే వార్త నిజమే అయితే.. మరి ఇప్పటివరకూ సుదీర్ తో కలిసి షోలు చేసిన రష్మీ, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో పాటు మిగితా జబర్దస్త్ కంటెస్టెంట్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలేమో. మరి టైం బాగాలేకపోతే వారికీ కూడా కరోనా సోకితే షోల పరిస్థతి ఏమిటి అని టెన్షన్ లో పడ్డారు.