https://oktelugu.com/

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక జోరు… కొత్త ప్రాజెక్ట్ షురూ, టైటిల్ విచిత్రంగా ఉందే!

నిర్మాతగా పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. సినిమా నిర్మాణం పైన కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా నిహారిక తన బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్ర విశేషాలు పంచుకున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 10, 2024 / 10:28 AM IST

    Niharika Konidela new movie title Committee Kurrollu

    Follow us on

    Niharika Konidela: నిహారిక కొణిదెల విడాకుల తర్వాత కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది. పెళ్లితో చిత్ర పరిశ్రమకు దూరమైన నిహారిక… ఇటీవల హీరోయిన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. దీంతో పాటు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘ వాట్ ది ఫిష్ ‘ సినిమాలో నిహారిక కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు యాంకర్ కూడా మారింది. ఓటీటీలో చెఫ్ మంత్ర పేరుతో స్ట్రీమ్ అవుతున్న షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

    అలాగే నిర్మాతగా పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. సినిమా నిర్మాణం పైన కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా నిహారిక తన బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్ర విశేషాలు పంచుకున్నారు. కొత్త ప్రాజెక్ట్ కి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ బ్యానర్స్ పై ‘ కమిటీ కుర్రాళ్ళు ‘ పేరుతో సినిమా ను అనౌన్స్ చేశారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ టైటిల్ ని విడుదల చేశారు.

    కాగా టైటిల్ గ్లిమ్స్ చూస్తుంటే .. ఇది గోదావరి పల్లెటూరి కాలేజీ కుర్రాళ్ళ కథ అని తెలుస్తుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ” మరి హారతి పల్లాలు, దండలు గట్రా దగ్గరెట్టుకోండమ్మా. మన కమిటీ కుర్రాళ్ళు బయలుదేరి పోయారు” అని రాసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

    అందులో కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. న్యూ కమర్స్ తో సినిమా చేయడం పెద్ద బాధ్యత అని నిహారిక తెలిపింది. ‘ కమిటీ కుర్రాళ్ళు’ అని టైటిల్ ఎందుకు పెట్టాము అనేది సినిమా చూసి తెలుసుకోవాలని .. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నిహారిక కొణిదెల వెల్లడించారు.