https://oktelugu.com/

Niharika Konidela: సాయిధరమ్‌ తేజ్‌తో కార్డ్‌ షేర్‌ చేసి షాకిచ్చిన నిహారిక.. మహూర్తం ఫిక్స్‌

ఇటీవల ఓ చెఫ్‌ మంత్ర అనే షోలో యాంకర్‌గానూ వ్యవహించారు నిహారిక. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఈ షోకు పిలిచి రచ్చ చేస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 7, 2024 / 03:14 PM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela: మెగా డాటర్‌ నిహారిక.. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుని విడిపోయిన నిహారిక తర్వాత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. నెట్టింట నిత్యం ట్రెండ్‌ అవుతున్నారు. డైవర్స్‌ తర్వాత పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఫొటోలు, వీడియోలను తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పనంచుకుంటున్నారు. సినిమారంగంలోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇటీవల ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ కూడా స్టార్‌ చేశారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా ఓ తమిళ సినిమనాలో నటిస్తున్నారు. నిర్మాతగా.. హీరోయిన్‌గా నిహారిక ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

    యాంకర్‌గా దర్శనం..
    ఇటీవల ఓ చెఫ్‌ మంత్ర అనే షోలో యాంకర్‌గానూ వ్యవహించారు నిహారిక. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఈ షోకు పిలిచి రచ్చ చేస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. టూర్స్, ట్రిప్స్‌కు ఫొటోలతోపాటు వీడియోలను షేర్‌ చేస్తోంది.

    ఓ కార్డుతో షాక్‌..
    తాజాగా నిహారిక ఓ కార్డు షేర్‌చేసింది. అచ్చం వెడ్డింగ్‌ కార్డులా ఉంది. కానీ కాదు. ఓ మూవీ టైటిల్‌ను ఫిక్స్‌ చేయడానికి అలా వెరైటీగా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పేరును సాయి ధరమ్‌తేజ్‌ గెస్ట్‌గా వచ్చి అనౌన్స్‌ చేయబోతున్నాడు. ఇక కార్డులో ఏముందంటే.. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్, ఎస్‌ఆర్‌డీ స్టూడియోస్‌ సంయుక్తంగా ప్రొడక్షన్స్‌–1 స్టార్ట్‌ కాబోతుంది. దీనిని సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గారిచే సినిమా నామకరణ మహోత్సవం.

    వేదిక ఏదంటే..
    ఇక ఇంత చేసి వేదిక పేరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ అని పేర్కొన్నారు. భోజనాలు ఎవరింట్లో వారు చేయాలని తెలిపారు. తేదీ శ్రీక్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు జరుగబోతుంది అని తెలిపారు. ఇక కార్డుపై ఆవిష్కకరణ కర్త సాయి ధరమ్‌ తేజ్‌ ఫొటో ఉంది. ధర్మకర్త స్థానంలో నిహారిక పేరు ఉంది. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. నిహారిక తొందరగా రెండో పెళ్లి గురించి కూడా ఇలాగే వెరైటీగా అనౌన్స్‌ చేస్తుందని చర్చించుకుంటున్నారు.

    Niharika Konidela